బాబు తలదించుకోవద్దనే..:లాబీల్లో మోత్కుపల్లి కంటతడి

ఆ సమయంలో ఆయన తన ఆవేదనను వారితో పంచుకున్నారు. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తనకు రాజ్యసభ సీటు విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తలదించుకోవద్దనే ఉద్దేశ్యంతో తాను ఎంతో కష్టపడ్డానని వివరించారు.
చంద్రబాబుతో తన సాన్నిహిత్యం చూసిన వారు అందరూ తనకు రాజ్యసభ సీటు ఖాయమని భావించారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ విషయంలో తాను తీవ్ర అవమానానికి గురయ్యానని వారితో చెప్పారు.
అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన మోత్కుపల్లి టిటిడిపి నేతల పైన మండిపడ్డ విషయం తెలిసిందే. రెండు సీట్లు ఆంధ్రావాళ్లకే ఇచ్చినా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉందని మండిపడ్డారు. ఆ సమయంలో కొందరు టిడిపి నేతలు ఆయన వద్దకు వచ్చి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దానికి మోత్కుపల్లి ససేమీరా అన్నారు. బాబును కలిసేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications