లోక్‌సభలో కాపు రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన ఎంపీ అవంతి
న్యూఢిల్లీ: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ లోక్‌సభలో శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. తాను ఎందుకు బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే అంశంపై అవంతి శ్రీనివాస్ తెలుగులోనే వివరించారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకే టీడీపీ ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలి? ఎంత సమయం కేటాయించాలి? అనే విషయంపై వచ్చే వారం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా, బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా తమిళనాడు తరహాలో షెడ్యూల్-9లో కాపులను చేర్చాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విద్య, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించింది.












Click it and Unblock the Notifications