Mudragada: పేరు మారినా తీరు మారలేదు-పవన్ ను టార్గెట్ చేస్తున్న ముద్రగడకు కూతురు కౌంటర్..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికీ, పవన్ కళ్యాణ్ కూ మధ్య వైరం నెలకొంది. పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసిన ముద్రగడ పద్మనాభం.. ఆయన్ను ఓడించకపోతే పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుమార్తె క్రాంతి బార్లపూడి పవన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల్లో పవన్ గెలుపుతో పేరు మార్చుకున్నాక కూడా ముద్రగడ విమర్శలు ఆపకపోవడంపై క్రాంతి మరోసారి స్పందించారు.
తాజాగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న ముద్రగడ.. డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తూ కాపులకు రిజర్వేషన్ ఇప్పించాలని, సినిమాలు మానుకోవాలని పలు వ్యాఖ్యలు చేసారు. దీనిపై ముద్రగడ కుమార్తె క్రాంతి ఘాటుగా స్పందించారు. తన తండ్రి ముద్రగడ పేరు మారినా తీరు మారలేదంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఇందులో పవన్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతే కాదు పవన్ కు మద్దతుగా తన పోరాటం కొనసాగుతుందని హింట్ ఇచ్చేసారు.

మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని ,అయన అలోచానా విదానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉన్నది.
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 21, 2024
జగన్ మోహన్ రెడ్డి గార్ని ఏనాడూ ప్రశ్నించని అయన , పవన్ కళ్యాణ్ గార్ని ప్రెశ్నించే అర్హత ఆయనకు ఉందా?
ఒకసారి,…
రిజర్వేషన్లపై సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ప్రశ్నించని తండ్రి ముద్రగడ పద్మనాభరెడ్డికి పవన్ ను ప్రశ్నించే అర్హత ఉందా అని క్రాంతి ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కు స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. శేష జీవితంలో ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాలని తండ్రికి క్రాంతి సలహా కూడా ఇచ్చారు. మరోమారు పవన్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు క్రాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
క్రాంతి తన ట్వీట్ లో " మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది' అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్‌పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా క్రాంతి స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? పేరు మార్చుకున్నాక కాపుల గురించి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications