'బాబు-లోకేష్‌లు ఏపీ వారెలా అవుతారు, జనసేన నేతలు కలిశారు.. ఆర్నెళ్లకో మీటింగ్ అంటే ఎలా?'

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు హైదరాబాదులో ఇల్లు ఉందని, అలాంటప్పుడు వారు ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులేనా, వారు ఇక్కడి వారు ఎలా అవుతారని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న నేత ముద్రగడ పద్మనాభం బుధవారం ప్రశ్నించారు.

మోడీ చెప్పారు! త్వరలో శుభవార్త: హోదా కోసం శ్రీవారికి రాఘవేంద్ర రావు గడ్డం

నాలుగేళ్ల పాటు చంద్రబాబు, లోకేష్‌లు కాపుజాతిని మభ్య పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముకు లెక్కలు అడిగితే చంద్రబాబుకు కోపం వస్తోందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్క చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ పైవిధంగా స్పందించారు.

 అబద్దాలతో కోల్డ్ స్టోరేజ్‌లో

అబద్దాలతో కోల్డ్ స్టోరేజ్‌లో

ఏపీలో జరిగే అన్ని ప్రజా పోరాటాలకు కాపు జాతి మద్దతు ఇస్తుందని ముద్రగడ వెల్లడించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు కాపుల ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అబద్దాలతో ఇన్నాళ్లు రిజర్వేషన్ల అంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారని చెప్పారు.

 న్యాయం చేసే వారికే మా మద్దతు

న్యాయం చేసే వారికే మా మద్దతు

వచ్చే ఎన్నికల్లో కాపులకు న్యాయం చేసే పార్టీకే తాము మద్దతిస్తామని పద్మనాభం వెల్లడించారు. ఎన్నికల వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని, హోదా ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగార్చారని ముద్రగడ ఆరోపించారు.

జనసేన నేతలను కలిశారు

జనసేన నేతలను కలిశారు

పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేన నేతలు తనను కలిశారని ముద్రగడ వెల్లడించారు. పార్టీ విషయంలో కొన్ని సలహాలు, సూచనల కోసం వారు తనను కలిశారని ఆయన వెల్లడించారు. అయితే ఆరు నెలలకు ఓసారి మీటింగ్ సరికాదని జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాయకులు రోడ్లపై ఉంటేనే జనం నమ్ముతారని తెలిపారు.

 రఘువీరా నోట టీడీపీ నేత మాట!

రఘువీరా నోట టీడీపీ నేత మాట!

కర్నాటకలోని తెలుగు ప్రజలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. ఇంతకుముందు, టీడీపీ నేతలు కూడా ఇదే చెప్పారు. బీజేపీ మినహా ఇతర పార్టీలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kapu leader and former Minister Mudragada Padmanabham says will support who give priority to Kapu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X