రాజమండ్రి: మురళీమోహన్‌కు అసమ్మతి దెబ్బ

తాజాగా, రెండు రోజుల క్రితం పంపిణీ అయిన ఓ కరపత్రం పార్టీలో కొత్తగా చిచ్చు పెట్టింది. గత ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి మురళీ మోహన్‌కు, అనపర్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి మూలారెడ్డికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి.
రెండు రోజుల క్రితం అనపర్తి నియోజకవర్గంలో రాత్రి పూట పంపిణీ అయిన కరపత్రాలపై మాజీ సర్పంచ్ నల్లమిల్లి వీర్రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించిన తీరు కూడా పార్టీలో విభేదాలు రచ్చకెక్కే ప్రమదాన్ని సూచిస్తున్నాయి. రాజమండ్రి లోకసభకు పోటీ చేసే మురళీమోహన్, అనపర్తి శాసనసభ స్థానాన్ని ఆశిస్తున్న జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి వీర్రెడికి వ్యతిరేకంగా కెసిఆర్ వ్యతిరేక పోరాట కమిటీ పేర గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను పంపిణీ చేశారు.
తమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి పూనుకున్న క్యాస్టిక్ సోదా తయారీ ప్లాంట్ చెప్పుచేతల్లో నడుస్తున్న మురళీ మోహన్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించిన నల్లమిల్లి మూలారెడ్డి తనయుడు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి అనపర్తి టికెట్ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆ కరపత్రంలో ఆరోపించారు. ఆ కరపత్రం వెనక మూలారెడ్డి వర్గీయుల పాత్ర ఉందనే వీర్రెడ్డి వర్గం అనుమానిస్తోంది.
గత ఎన్నికల్లో మురళీమోహన్ రాజమండ్రి లోకసభ స్థానానికి, మూలా రెడ్డి అనపర్తి శాసనసభా నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. అనపర్తి శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి శేషారెడ్డికి భారీ మెజారిటీ రావడంపై మూలారెడ్డిని మురళీ మోహన్ తప్పు పట్టారు. దాంతో వారిద్దరి మధ్య అప్పట్లో విభేదాలు పొడసూపాయి. ఇప్పుడు ఆ విభేదాలు కొనసాగుతున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications