వీడిన మిస్టరీ: భార్య, బావమరిది మిత్రులతో కలిసి చంపేశారు
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సామెల గ్రామ శివారులో ఈ నెల 7న కొమురం భీమ్ ప్రాజెక్టు కాలువలో లభించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ వీడింది. పోలీసులు మృతదేహం ఫొటోను సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో పెట్టారు. దాంతోమృతుడి సోదరుడు 11వ తేదీన గుర్తించి పోలీసులను సంప్రదించాడు.
ఆ వ్యక్తిని కుట్ర పన్ని హత్య చేసింది అతని భార్య సునిత, బావమరిది జంగిడి కనక య్య అతని మిత్రులని ప్రాథమిక విచారణలో తేలడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పం పినట్లు చెప్పారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నారు.

బొమ్మెన శ్రీనివాస్ జగిత్యాల మండలం కల్లెడలో ఎఫ్‌బీఓగా పని చేస్తున్నాడు.
పెళ్లయిన కొన్నేళ్లకు ఆయన భార్యతో వేరే కాపురం పెట్టాడు. తరుచూ దంపతుల మధ్య గొడవలు రావడంతో భార్య సునిత పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 7వ తేదీన శ్రీ నివాస్ బావమరిది కనకయ్య, అతని మిత్రులు దేవి రాజశేఖర్, మురళి, చొప్పదండి రాజశేఖర్, మోహన్‌లతో కలిసి బసంత్‌నగర్‌లోని తన బావ వద్దకు వెళ్లాడు.
సోదరి కాపురం గురించి మాట్లాడాలని రావలసిందిగా కోరాడు. తను వెంట తెచ్చుకున్న కారులో బయల్దేరాడు. వాంకిడి మండలం, సామెల శివారుకు వచ్చి అక్కడ కొట్టి చంపారని తెలిపారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రాజెక్టులో పడేశారని అంటున్నారు. మృతుడి సోదరుడు శవాన్ని గుర్తించడంతో ఫోన్ కాల్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications