విద్యార్థుల ధర్నా.. కొట్టి, తిట్టి: రోడ్డుపై మ్యూజిక్ టీచర్ వీరంగం
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ ఉపాధ్యాయురాలు వీరంగం సృష్టించారు. నడి రోడ్డు పైన ఆమె విద్యార్థులను చితకబాదింది. తమను వేధిస్తున్నారని చెబుతూ అమ్మాయిలు ఆందోళనకు దిగడంతో ఆమె వారిని పరుషపదజాలంతో దూషించడంతో పాటి చితకబాదింది.
టిటిడి సంగీత ఉపాధ్యాయురాలిగా భాగ్యరేఖ పని చేస్తున్నారు. అయితే, తమను ఆమె వేధిస్తున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. రోడ్డు పైననే ఆమె విద్యార్థుల పైన చేయి చేసుకున్నారు. తిట్టారు. ఈ విషయాన్ని తాము ఈవో, డీఈవోకు ఫిర్యాదు చేస్తామని యాజమాన్యం చెప్పింది.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి పైన సంబేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
కడప జిల్లా సంబేపల్లి మండలం దుద్యాలకు చెందిన పవన్ కుమార్, చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన శివకుమార్ రెడ్డిలు తిరుపతిలోని రాయలసీమ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు.
గురువారం ఇంటికి వచ్చిన వీరు శుక్రవారం ఉదయం బైక్ పైన తిరుపతి వెళ్తుండగా సంబేపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. శివకుమార్ రెడ్డి(22) అక్కడికక్కడే మృతి చెందగా, పవన్ కుమార్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications