నా వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ పెరిగింది.. గంటాకు అయ్యన్న కౌంటర్?, విభేదాలు లేవంటూనే..
తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. విశాఖ భూవిదాంపై తాను స్పందించిన తర్వాతే సిట్ విచారణ వేశారని తెలిపారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తాము
విజయవాడ: విశాఖ భూదందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మంత్రి అయ్యన్న ఆరోపించడం.. పార్టీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపిస్తూ మరో మంత్రి గంటా సీఎంకు లేఖ రాయడం.. విశాఖలో టీడీపీ లుకలుకలు బయటపడేలా చేసింది.
ఇంతలోనే అలాంటిదేమి లేదంటూ మంత్రి అయ్యన్న మీడియాకు వివరణ ఇచ్చుకోవడం.. అదే సమయంలో గంటాకు చురకలంటించేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.గురువారం నాడు మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. విశాఖలో భూ వివాదాలు పరిష్కారం కావాలన్నదే తమ ఇద్దరిని అభిమతమని గంటాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అదే సమయంలో పార్టీ ప్రతిష్టను దిగజార్చారన్న గంటా ఆరోపణను ఆయన అంగీకరించలేదు. తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. విశాఖ భూవిదాంపై తాను స్పందించిన తర్వాతే సిట్ విచారణ వేశారని తెలిపారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
కాగా, గురువారం ఉదయం జరిగిన టీడీపీ సమన్వయ భేటీ సమావేశంలో విశాఖ భూముల వ్యవహారంపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులను సీఎం మందలించిన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications