కొండాసురేఖ చేరికపై యాష్కీ: బాబుకి మైనంపల్లి ఝలక్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ద్రోహులకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలా చోటు కల్పించి, టిక్కెట్లు ఇస్తారని నిజామాబాద్ కాంగ్రెసు పార్టీ పార్లమెంట సభ్యుడు మధుయాష్కీ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు. భావితరాలకు భవిష్యత్ కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు.

కాంగ్రెసుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ ఏర్పాటులో ఎంపీల పోరాటం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పని చేశామని చెప్పారు. విద్యార్థులను రాళ్లతో కొట్టించిన, ఉద్యమానికి అన్యాయం చేసిన కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలను తెరాసలో ఎలా చేర్చుకుంటారని కెసిఆర్‌ను యాష్కీ ప్రశ్నించారు.

Mynampally to join Congress

కాంగ్రెసులోకి మైనంపల్లి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంత రావు కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని సమాచారం. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా టిడిపి మల్కాజిగిరి స్థానాన్ని బిజెపికి ఇవ్వడంతో ఆయన అలక వహించి కాంగ్రెసులో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మల్కాజిగిరి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశముంది.

కెసిఆర్‌కు ఆకుల ఝలక్

మరోవైపు మల్కాజిగిరి శాసన సభ్యుడు ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రానున్నారని సమాచారం. ఇటీవలె ఆయన తెరాసలో చేరారు. ఇప్పుడు కెసిఆర్‌కు షాకిచ్చి తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారట.

పొత్తుపై విహెచ్ ఆగ్రహం

బిజెపి, టిడిపి పొత్తుపై వి హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర రాజకీయాలను వెంకయ్యనాయుడు హైజాక్ చేస్తున్నారని విహెచ్ మండిపడ్డారు. టిడిపి, బిజెపి పొత్తు అనైతికమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+