పవన్ - టీడీపీ మధ్య లెక్కసెటిల్ బాధ్యత ఆయనదే - అంబటి..!!

జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని వ్యాఖ్యానించారు. బందరు వెళ్లి చెప్పులు వెతుక్కుంటే మంచిది అని సూచించారు. పయ్యావుల కేశవ్‌కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

వారాహి యాత్ర‌కు మ‌ళ్లీ ఎప్పుడు : పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర‌కు మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తార‌ని మంత్రి అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయారని ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించారని.. వెయ్యి సార్లు వైయ‌స్ జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ కల్యాణ్‌ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని సలహా ఇచ్చారు.

ambatipkcbn1

పయ్యావుల కేశవ్‌కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రూ.900 కోట్లు మాయం అయ్యాయని వాపోతున్నారు.. ఆర్.ఈ.సీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు.

మనోహర్‌ కార్మికుడిలా : టీడీపీ, జనసేనల మధ్య నాదెండ్ల మనోహర్‌ కార్మికుడిలా పని చేస్తున్నారని అంబటి చెప్పుకొచ్చారు. రెండు ప్యాకేజీల వారాహి యాత్రను పవన్‌ నిన్న తణుకులో ముగించారని ఉద్దేవా చేసారు. మళ్లీ ఎప్పుడు వస్తారో చెప్పాలన్నారు. పవన్‌ మళ్లీ రావాలంటే ఒక లెక్క ఉంటుందని...

నాదెండ్ల మనోహర్‌ లెక్క టీడీపీతో సెటిల్‌ చేస్తే పవన్‌ మళ్లీ వస్తారన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డని రాంబాబు చెప్పుకొచ్చారు.. ఒక్క పైసా అవినీతి లేకుండా రూ.2.20 లక్షల కోట్లు బటన్‌ నొక్కి ప్రజల ఖాతాల్లోకి జమ చేసిన వ్యక్తి అని వివరించారు. చెప్పులు పోయాయని బాధపడటం ఎందుకన్న రాంబాబు.. బందర్‌లో వెతుక్కోండి దోరుకుతాయని సూచించారు.

ambati

పోలవరంపై విష ప్రచారం : పోలవరం పైన టీడీపీ, మద్దతు మీడియా విషం చిమ్ముతోందని రాంబాబు ఆరోపించారు. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైయ‌స్ జగన్‌దేనని వివరించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణం వరదల వల్ల కొట్టుకుపోలేదన్నారు. కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం, కమిషన్ల వలనే కొట్టుకుపోయిందని వివరించారు.

దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కి మరమ్మత్తు చేయటమా? కొత్తది నిర్మాణమా అనే దానిపై సీడబ్ల్యుసీ ఆలోచిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో సగంలో వదిలేసి పారిపోయారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది గత ప్రభుత్వమేనని రాంబాబు ఆరోపించారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+