కిలాడీ లేడీ: ఇద్దరితో పెళ్లి, మరొకరితో దోస్తీ, భక్తులకు కోట్ల టోపీ
నెల్లూరు: భక్తి పేరు మీద మోసాలకు పాల్పడిన కిలాడీ లేడీ మెతుకు వెంకట నాగవాసవి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నెల్లూరులోని ప్రశాంతినగర్ గురు దత్తాత్రేయ ఆశ్రమాన్ని అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడింది.
ఆమె భక్తుల నుంచి కోట్ల రూపాయలను ఆమె వసూలు చేసినట్లు కేసు నమోదైంది. ఆ ఘటన గురువారంనాడు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇలా పెళ్లిళ్లు చేసుకుంది
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మిర్యాలపాళేనికి చెందిన నాగవాసవి తొమ్మిదేళ్ల క్రితం సునీల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. గొడవల కారణంగా అతనితో విడిపోయింది. ఆ తర్వాత ఆంజనేయులు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనికి కూడా ప్రస్తుతం దూరంగా ఉంటోంది.

ఆ తర్వాత అతనితో స్నేహం
ఆ తర్వాత ఒంగోలులోని ట్రంక్ రోడ్డులో ఓ ఫర్నీచర్ షాపు నడుపుతున్న బాషా అలియాస్ మస్తాన్‌తో ఆమె స్నేహం చేస్తోంది. మహా మంత్రయాగం పేరుతో నెల్లూరులోని ప్రశాంతినగర్‌లో కొన్ని వారాలుగా పాల్గొంటోంది. మెల్లగా భక్తులను ముగ్గులోకి దింపుతూ వాసవి కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

డబ్బులను ఇలా చేరవేసింది...
పక్కా పథకం ప్రకారం వాసవి కోట్లాది రూపాయలను తన కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు చెబుతున్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల నగదుతో సంచులను కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఒంగోలులోని తన స్నేహితుడు బాషా అలియాస్ మస్తాన్, సోదరుడు మెతుకు రాా, విజయవాడలోని మామయ్య అయిన రైల్వే ఉద్యోగి వెకట సురేష్ బాబులకు సంచుల నిండా డబ్బులు అందజేసినట్లు చెబుతున్నారు.

కూతురుతో పారిపోయింది
ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం వాసవి తన ఆరేళ్ల చిన్నారితో కలిసి చెక్కేసింది. ఆమె ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాసవికి సుధాకర్ బాబాతో ఏ విధమైన సంబంధాలున్నాయనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications