రికార్డుల నైనా: 14 ఏళ్లకే బిఏ! ఏడేళ్లకే శ్లోకాలు(పిక్చర్స్)
హైదరాబాద్: నైనా జైస్వాల్ పద్నాలుగు ఏళ్లకే బిఎ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ రంగంలో రాణిస్తున్న నైనా గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని వివేకానంద కాలేజీలో పరీక్షలకు హాజరయ్యారు.
పొలిటికల్ సైన్స్ ఫస్ట్ పేపర్ పరీక్ష రాశారు. పదో తరగతి పరీక్షలు రాసిన ఆసియా యంగెస్ట్ కూడా నైనా జైస్వాల్ కావడం గమనార్హం. ఈమె 2008లో తన ఎనిమిది సంవత్సరాల రెండు నెలల వయస్సులో ఎస్ఎస్ఎస్సీ పరీక్షలు రాశారు.
నైనా జైస్వాల్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో పరీక్షలు రాశారు.

రికార్డుల నైనా: 14 ఏళ్లకే బిఏ! ఏడేళ్లకే శ్లోకాలు(పిక్చర్స్)
2009లో తొమ్మిదేళ్ల వయస్సులో పదకొండో తరగతి, 2010లో పదేళ్ల వయస్సులో పన్నెండో తరగతి పరీక్షలను నైనా జైస్వాల్ రాశారు.

రికార్డుల నైనా: 14 ఏళ్లకే బిఏ! ఏడేళ్లకే శ్లోకాలు(పిక్చర్స్)
2012లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ మాస్ కమ్యూనికేషన్‌లో ఫస్ట్ ఇయర్, 2013లో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు. ఇప్పుడు పద్నాలుగేళ్ల వయస్సులో ఆమె బిఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు.

రికార్డుల నైనా: 14 ఏళ్లకే బిఏ! ఏడేళ్లకే శ్లోకాలు(పిక్చర్స్)
నైనా జైస్వాల్ తన ఏడేళ్ల వయస్సులో రామాయణ శ్లోకాలను కంఠస్థం పట్టారు. పియానో వాయిస్తారు. గాయకురాలు. అంతేకాదు నైనా రెండు చేతులతో రాస్తారు.

రికార్డుల నైనా: 14 ఏళ్లకే బిఏ! ఏడేళ్లకే శ్లోకాలు(పిక్చర్స్)
సిఎస్2, ఫోటోషాప్, కోరల్ డ్రా తదితర వాటిల్లో నిష్ణాతురాలు. ఎ నుండి జెడ్ వరకు గల ఆంగ్ల అక్షరాలను కేవలం 2.72 సెకండ్లలో టైప్ చేస్తారు. నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్‌లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ మెడళ్లు సాధించారు.

Click it and Unblock the Notifications