నల్గొండ సీఐ...ఆంధ్రాలో ఇక్కడ ఇలా దొరికిండు
నిన్న మొత్తం కనిపించకుండా పోయి తీవ్ర కలకలాన్ని సృష్టించిన నల్గొండ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు గుంటూరు జిల్లాలో దొరికాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలోని ఒక రిసార్ట్ లో సీఐ ఉన్నట్లు గుర్తించిన నల్గొండ పోలీసులు ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో స్థానిక మెరైన్ పోలీసులు ఓ రిసార్టులో మారుపేరుతో రహస్యంగా తలదాచుకున్న సీఐ ని గుర్తించారు. సీఐతో కలిసి పోలీస్ బృందం బాపట్ల నుంచి నల్గొండకు బయలుదేరింది. మరికొద్ది గంటల్లో డిఐజీ ముందుకు సిఐ వెంకటేశ్వరావును ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

అదృశ్యమైన 24 గంటల తరువాత నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించింది. ఆయన మిర్యాలగూడ సమీపంలో ఓ రిసార్టులో ఉన్నారని, కాసేపట్లో ఆయన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముందు హాజరవుతారంటూ తొలుత వార్తలు వెలువడ్డాయి. ఆయితే ఆ తరువాత ఆయన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఓ రిసార్టులో క్షేమంగానే ఉన్నారని ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరోవైపు సీఐ కుటుంబ సభ్యులు కూడా నల్గొండ బయలుదేరినట్లు తెలుస్తోంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications