వైసీపీ రాక్షస పాలనకు క్లైమాక్స్, పాపాలు ఫినిష్, అందుకే మోదీ వస్తున్నారు, మాజీ సీఎం !

వైకాపా ప్రభుత్వంలో ఇసుక, గనుల అక్రమ దోపిడి, అక్రమ మద్యం వ్యాపారం, అక్రమంగా మద్యం రవాణా, వనరుల దోపిడీ, భూకబ్జాలు వైసీపీ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించారని, ఆ డబ్బును ఈ ఎన్నికల్లో ఓటర్లకు భారీ మొత్తంలో ఖర్చు చేసి మరోసారి గెలవాలని చూస్తున్నారని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే వైసీపీ నాయకుల మాయమాటలకు మరో ఐదు సంవత్సరాలు బలికావలసి వస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు నియోజక వర్గంలోని కలికిరిలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మీద, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Nallari Kiran Kumar Reddy accused YCP leaders of destroying Andhra Pradesh

భూకబ్జాలు చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మామిడి, పాడి రైతులను నిలువునా దోపిడీ చేసి వారిని నష్టపరిచారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రైతుల ఉసురు తగులుతుందని, పెద్దిరెడ్డి పాపాలు పండిపోయే రోజులు దగ్గరపడ్డాయని, అంత వరకు రైతులు ఓపికగా ఉండాలని మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకపాలనను అంతం చెయ్యడానికి ప్రతిఒక్కరు పని చెయ్యాలని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కిరణ్ కుమార్ రెడ్డి మనవి చేశారు. ఈ నెల 8వ తేదీన కలికిరిలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అందరూ శ్రమించాలని, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనవి చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ మే 8వ తేదీన కిలికిరి పర్యటన సందర్బంగా పీలేరు, కలికిరి, వాల్మీకిపురం తదితర ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+