బాలకృష్ణ, రవితేజ... ఒకే మాటమీద
తెలుగు సినిమాలకు సంబంధించి గతంలో థియేట్రికల్ బిజినెస్ పైనే ఆధారపడేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ పరిధి విస్తరిస్తూ వస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకే కోట్ల రూపాయల్లో ఉంటోంది. దీనివల్ల సినిమా తీసే నిర్మాత ఎటువంటి టెన్షన్ పడటంలేదు. మంచి కథతోపాటు మంచి కాంబినేషన్ కుదిరితే ఎంత ఖర్చుపెట్టడానికైనా ప్రొడ్యూసర్ వెనకడుగు వేయడంలేదు.
టాలీవుడ్ లో మన కథానాయకులు సైతం రెమ్యునరేషన్ విషయంలో గతంలో పెట్టుకున్న హద్దులను చెరిపేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో నందమూరి బాలకృష్ణ, రవితేజ చేరారు. అఖండ సినిమా విడుదలవడానికి ముందు బాలయ్య రెమ్యునరేషన్ రూ.10 కోట్లుగా ఉండేది. అఖండ నుంచి వరుసగా హిట్లు పడుతుండటంతోపాటు రానున్న భగవంత్ కేసరికి మంచి బజ్ క్రియేటవడంతో రెమ్యునరేషన్ ఏకంగా రూ.20 కోట్లు చేసినట్లు పరిశ్రమలో వార్త గుప్పుమంది. బాలకృష్ణతో సినిమా తీస్తున్న నిర్మాతలు కూడా ఆయనకు అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారు.

మాస్ మహారాజా రవితేజ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ధమాకా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఆ సినిమా నుంచి రవితేజ తన రెమ్యునరేషన్ పెంచేశారు. వాల్తేరు వీరయ్య సినిమాకు ఆయన పనిచేసింది కేవలం రెండు వారాలు. రోజుకు రూ.50 లక్షల చొప్పున రూ.7 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ధమాకా సినిమా తీసిన నిర్మాతలతోనే ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికోసం రూ.25 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినపడుతోంది. ధమాకా సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకున్న నిర్మాతలు రవితేజ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications