నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న అకాల మరణాలు
మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
నందమూరి కుటుంబంలో మరోసారి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయలో ప్రాణాలతో పోరాడుతున్న నందమూరి తారకరత్న (40) తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం సందర్భంగా హాజరైన తారకరత్న అకస్మాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలి అస్వస్థతకు గురయ్యారు. కుప్పంలో ప్రాథమిక చికిత్స అందించి తర్వాత బెంగళూరుకు తరలించారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో తారకరత్న కన్నుమూశారు. రోడ్డు ప్రమాదాలతోపాటు ఆకస్మిక మరణాలు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూత
మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అన్నెపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. ఓ వాహనాన్ని తప్పించే క్రమంలో హరికృష్ణ నడుపుతున్న వాహనం డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతలవైపు ఎగిరిపడింది. డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ వాహనం నుంచి బయటకు ఎగిరి పడ్డారు. తలకు తీవ్ర గాయాలవడంతో నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు.

నందమూరి జానకిరామ్.. అదే జిల్లాలో
హరికృష్ణ ప్రమాదం జరగడానికి నాలుగు సంవత్సరాల క్రిందటే ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా రోడ్డుప్రమాదంలో మరణించారు. ఆయన కూడా అదే జిల్లాలో కన్నుమూశారు. 2014 డిసెంబరు6న కోదాడవద్ద ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ను ఢీకొట్టింది. జానకిరామ్ ప్రయాణిస్తున్న సఫారి ట్రాక్టర్ ట్రాలీని కొట్టడంతో తీవ్రగాయాలైన జానకిరామ్ ను ఆసుపత్రికి తరలించేసరికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి 2022 ఆగస్టు 1న హఠాన్మరణం చెందిన వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్యంతో బాధపడిన ఉమామహేశ్వరి ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్లిన ఉమామహేశ్వరి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు.

జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం..
తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగివస్తూ 2009 మార్చి 27న హైదరాబాద్ తిరిగి వస్తూ ఖమ్మంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని కిమ్స్ స్పత్రికి తరలించి చికిత్స అందించగా అనంతరం కోలుకున్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నందమూరి రామకృష్ణ కారు ప్రమాదం
ఈనెల 10న ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10లో జరిగిన ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. స్వల్ప గాయాలతో రామకృష్ణ బయటపడ్డారు. దీంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 2004లో ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ ఆకస్మికంగా మరణించారు. ఇలా.. నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు జరగడం.. అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications