విషమంగా తారకరత్న ఆరోగ్యం - ఆందోళన..!!
తారకరత్న ఆరోగ్యం కోలుకుంటున్నట్లుగా భావిస్తన్న సమయంలో మరోసారి విషమించినట్లు తెలుస్తోంది.
నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. తీవ్ర గుండెపోటుతో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్యం కోలుకుంటున్నట్లుగా అందరూ భావించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల టీం తారకరత్నకు చికిత్సం చేస్తోంది. కుప్పంలో గుండోపోటుకు గురైన వెంటనే ఆయన్ను స్థానికంగా ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స చేసారు. ఆ సమయంలోనే తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైనట్లుగా వైద్యులు నిర్దారించారు. మెరుగైన చికిత్సం కోసం ప్రత్యేక అంబులెన్సులో అక్కడ నుంచి బెంగుళూరు నారాయణ హృదయాలయ కు తరలించారు. 20 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు.

విదేశీ వైద్యులతో చికిత్స
బెంగళూరు ఆస్పత్రిలో చేర్చిన తారకరత్న క్రమేణా కోలుకుంటున్నట్లు కనిపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నను పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ తొలి రోజు నుంచి తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో..బెంగళూరులో వైద్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. తారక రత్న ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు. తారకరత్న గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడ్డారని.. మెదడు కు సంబంధించిన చికిత్స జరుగుతోందని చెబుతున్నారు. విదేశాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన న్యూరో వైద్యులు తారకరత్న కు చికిత్స అందిస్తున్నారు.

కోలుకుంటున్నారని భావిస్తున్న వేళ
జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ సమయంలో తారకరత్న పొల్గొన్నారు. అక్కడే అస్వస్థతకు గురయ్యారు. తారకరత్నకు ఈ రోజు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రోజు కంటే పరిస్థితిలో మార్పు కనిపించినట్లు తెలుస్తోంది. మెదడుకు సంబంధించి నీరు ఉండటంతో చికిత్స చేస్తున్నారు. నీరు కారణంగా ఏర్పడిన వాపు తగ్గితేనే తిరిగి వేగంగా కోలుకోవటానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు క్షీణించినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి వైద్యులు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఈ సాయంత్రానికి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు అందిస్తున్న చికిత్స..తారకరత్న స్పందిస్తున్న తీరు పైన స్పష్టత ఇవ్వనున్నారు.

కోలుకోవాలని ఆకాంక్షిస్తూ
తారకరత్న కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్ ఆస్పత్రికి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చిన సమయంలో మంత్రితో పాటుగా నటుడు శివ రాజ్ కుమార్ కూడా తారకరత్నను పరామర్శించారు, మంత్రి వైద్యులతో చర్చించారు. అందిస్తున్న వైద్య సాయం పైన ఆరా తీసారు. ప్రభుత్వం నుంచి పూర్తి
సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తారకరత్న సతీమణి..కుమార్తెలకు ధైర్యం చెప్పారు. అయితే, తారకరత్న ఆరోగ్యం పైన వైద్యులు పూర్తి సమాచారం ఇస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications