ఇవేం ఎండల్రా సామి- ఏపీలో అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత
Temperature in AP: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది.

ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
మంగళవారం నంద్యాల, కర్నూలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లాలోని పెద్ద దేవళాపురంలో 42.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. కడప జిల్లా ఖాజీపేటలో 41.8 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నేడు మొత్తం 58 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లా-13, విజయనగరం-18, పార్వతీపురం మన్యం-14, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-2, తూర్పుగోదావరి-7, ఏలూరు-1 మండలాలు ఉన్నాయి.
ఆయా చోట్ల వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం కూడా దీని తీవ్రత కొనసాగుతుందని, 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఎండ తీవ్రత సమయంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications