Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్కడినే వస్తా.. ఆ 57మందినీ రమ్మంటూ.. సీమ గడ్డపై లోకేష్ ఛాలెంజ్!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో జోష్ గా కొనసాగి నేడు ముగిసింది. రాయలసీమలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన ఛాలెంజ్ చేశారు. రాయలసీమ ఎమ్మెల్యేలు 49మంది, ఎంపీలు 8మంది.. మీరు 57మందీ రండి అంటూ పేర్కొన్నారు.

రాయలసీమ ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం.. నేను ఒక్కడినే వస్తా.. చర్చకు మేం సిద్ధం అంటూ నారా లోకేష్ సవాల్ చేశారు. రాయలసీమకు మీరేం చేస్తారో చెప్పే దమ్ము ఉందా అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ముందు సెల్ఫీలు దిగిన లోకేష్ ఆ సెల్ఫీ లతో వైసిపి ప్రజాప్రతినిధులను చాలెంజ్ చేశారు.

Nara Lokesh challenged ysrcp MLAs and MPs over rayalaseema development

బద్వేలు క్యాంప్ సైట్ ముందు, టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, రాయలసీమకు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ టిడిపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో టీడీపీ చేసిన అభివృద్ధిని లోకేష్ చూపించారు. ఈ క్రమంలోనే లోకేష్ వైసీపీ నేతలకు మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలి అని సవాల్ విసిరారు.

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ మేం చేసింది ఏంటో చూపించాను. మీరు చేసింది ఏమిటో చెప్పే దమ్ము ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్ వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు రాయలసీమకు చేసిందేమీ లేదని, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఒక పరిశ్రమ ను కూడా తీసుకు రాలేదని లోకేష్ మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి చేసింది తామేనని పేర్కొన్న లోకేష్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+