అవినాశ్‌కు నారా లోకేష్ హామీ: దేవినేని నెహ్రూకు నాడు చంద్రబాబు హామీ!
దేవినేని నెహ్రూ కుటుంబ సభ్యులను మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌కు లోకేష్ హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యులకు, నీకు అండగా ఉంటామని చెప్పారు.
విజయవాడ: దేవినేని నెహ్రూ కుటుంబ సభ్యులను మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌కు లోకేష్ హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యులకు, నీకు అండగా ఉంటామని చెప్పారు.
మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని నెహ్రూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని మంత్రులు చినరాజప్పతో కలిసి నారా లోకేష్ పరామర్శించారు.
గుణదలలోని నెహ్రూ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నారా లోకేష్ వెంట ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, గద్దె రామ్మోహన్ రావు, ఎంపీ కేశినేని నాని, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు ఉన్నారు.

కొడుకు కోసం దేవినేని ప్రయత్నాలు
దేవినేని నెహ్రూ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజకీయంగా బెజవాడలో మంచి పట్టు ఉంది. అయితే, అనారోగ్యం కారణంగా తన తర్వాత తన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని భావించారు. ఇందుకోసం గత ఒకటి రెండేళ్లుగా అవినాశ్‌ను తెరపైకి తీసుకు వచ్చారు.

చంద్రబాబు హామీ మేరకు..
దేవినేని అవినాశ్‌కు మంచి రాజకీయ జీవితం ఇచ్చేందుకు దేవినేని నెహ్రూ ప్రయత్నించారు. ఇందుకోసం సీఎం నారా చంద్రబాబు నాయుడుతో దేవినేని నెహ్రూ గతంలోనే మాట్లాడారని, ఆయన హామీ మేరకే టిడిపిలో చేరారని చెబుతారు. కొడుకు భవిష్యత్తు కోసమే సైకిల్ ఎక్కారని అంటారు.

దేవినేని నెహ్రూ మృతి తర్వాత..
దేవినేని నెహ్రూ మృతి నేపథ్యంలో.. ఆయనకు ఇచ్చిన హామీని చంద్రబాబు నెర్వేర్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్.. అవినాశ్‍కు ఇప్పటికి రెండుమూడుసార్లు ధైర్యం చెప్పారు. అన్నింటా నెహ్రూ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తద్వారా రాజకీయంగా కూడా అండగా ఉంటామని చెబుతున్నారు.

ఇచ్చిన హామీ మేరకు..
కొద్ది రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణలో పలువురు నేతలకు చోటు దక్కలేదు. వైసిపి నుంచి వచ్చిన వారికి మాత్రం మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. దీనిపై తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురు చంద్రబాబును ప్రశ్నించారు.
దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. మనం హామీ ఇవ్వడంతో ఇతర పార్టీ నేతలు వచ్చారని, పార్టీ బలపడుతుందని, కాబట్టి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పార్టీ కోసం కొన్ని తప్పదని చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications