కాస్త ఆగండి: జగన్, ఆయనలా కాదు!: లోకేష్ (పిక్చర్స్)
హైదరాబాద్/కడప: నాలుగు నెలలు ఓపిక పట్టాలని, అన్ని పనులు జరుగుతాయని, మనకు మంచి రోజులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. శనివారం ఆయన కడప జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనకు మంచి రోజులు వస్తాయన్నారు.
మరోవైపు యువత పైన దృష్టి సారించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. ఓ ప్రతినిది పార్టీది విభజనవాదమా.. సమైక్యవాదమా అని అడిగారు.
దానికి నారా లోకేష్ స్పందిస్తూ తన తండ్రిది రాయలసీమ అని, అమ్మది అమ్మది కోస్తా అని, తాను పుట్టింది తెలంగాణ అని, తమ అత్తమామలది ఆంధ్రా అని, తాను అందరివాడను అని చెప్పారు. జగన్‌లా నమ్ముకున్నవాళ్లకు ద్రోహం చేయలేనని, కుట్రలు చేయలేనని, ఆయనలా ఓ ప్రాంత ప్రజలకు కార్యకర్తలకు అన్యాయం చేయడం తనకు చేతకాదని చెప్పారు.
అందుకే సమన్యాయానికి కట్టుబడి ఉందాం అని స్పష్టం చేశారు. జగన్ కుప్పం మీదుగా యాత్ర చేపట్టడాన్ని కొందరు ప్రస్తావించగా లోకేష్ స్పందిస్తూ జగన్‌కు కుప్పంలో పరాభవం తప్పదు. వైయస్ కుప్పంకు నిధులు రాకుండా అడ్డుకున్నారు. అందుకే కుప్పం ప్రజలు ఆయన యాత్రను తప్పకుండా అడ్డుకుంటారని తెలిపారు.

జగన్ - భారతి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ నాలుగు నెలలు ఒపిక పట్టాలని సూచించారు.

లోకేష్ 1
2014 ఎన్నికల్లో యువతను ముఖ్యంగా విద్యార్థులను పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ పెద్ద కసరత్తే మొదలు పెట్టారు. అందులో భాగంగా శనివారం ఆయన తన నివాసంలో టిడిపి అనుబంధ విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సుమారు 10 గంటలకుపైగా వీరితో లోకేష్ సమావేశమవ్వడం గమనార్హం.

లోకేష్ 2
ఎక్కువగా ప్రతినిధుల అభిప్రాయాలు వినడానికే లోకేష్ ప్రాధాన్యమిచ్చా రు. నేనూ మీలాంటి సామాన్య కార్యకర్తనే అంటూ ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

లోకేష్ 3
రానున్న ఎన్నికల్లో యువతకు టికెట్లు కేటాయింపు వంటి అంశాలను లోకేష్ వద్ద ప్రతినిధులు ప్రస్తావించారు. యువత గర్జన పేరుతో రాష్ట్రస్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించాలన్న సూచనపైనా చర్చ నడిచింది. మరో 10 రోజుల్లో జిల్లా యువజన కమిటీలతోపాటు రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

లోకేష్ 4
ఈ భేటీ సమయంలో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని ప్రాంతాలకు చెందినవాడిని అన్నారు. అదే సమయంలో జగన్‌లా నమ్ముకున్నవాళ్లకు ద్రోహం చేయలేనని, కుట్రలు చేయలేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications