అడ్డంగా బుక్కైన నారా లోకేష్ (వీడియో)
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై చేస్తున్న విమర్శలు నిజమని నారా లోకేష్ మరోసారి నిరుపించారు. తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌తో నిలిచినపోయిన యువగళం పాదయాత్రను ఆయన సోమవారం పునః ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9న రాజోలు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు.
పాదయాత్ర ఎక్కడైతే ఆపేశారో అక్కడ నుంచే తిరిగి తన పాదయాత్రను ప్రారంభించారు. సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ నారా లోకేష్ స్పీచ్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. గతంలో మాట్లాడిన మాదిగానే నారా లోకేష్ తప్పులు మాట్లాడటం కనిపించింది. తప్పులు లేకుండా మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన వల్ల కావడం లేదు. ఆవేశంగా మాట్లాడే సమయంలో ఏదేదో మాట్లాడుతూ ప్రజలనే కాకుండా సొంత పార్టీ నేతలను సైతం అయోమయంలో పడేస్తున్నారు.

లోకేష్ మాట్లాడుతున్నారంటే ఎలాంటి ఆణిముత్యాలు జాలువారుతాయో అని ఎదురు చూసేవారికి గట్టిగానే పని కల్పించారాయన. తాజాగా అలాంటి సన్నివేశమే ఒకటి లోకేష్ సభలో చోటు చేసుకుంది. రాజోలు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ తల్లికి వందనం సాయం గురించి ప్రస్తావించారు. అమ్మఒడి పథకం పేరు చెప్పి జగన్ మాట తప్పారని ఆరోపణలు చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల రూ.15 వేలు అందిస్తామని.. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు.. ఇస్తామని ..ముగ్గురు పిల్లలు ఉంటే రూ.90 వేలు అందిస్తామని చెప్పి నోరు జారారు. నెలకు అని.. రూ.45 వేలకు బదులు రూ.90 వేలు అని చెప్పి నారా లోకేష్ అడ్డంగా బుక్కయ్యారు. ఏడాదికి బదులు నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది.దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెల నెలా అమ్మఒడి 15,000.. ముగ్గురుంటే ప్రతీ నెలా తొంభై వేలు ఇస్తాం.. pic.twitter.com/8VTHjScgx0
— Inturi Ravi Kiran (@InturiKiran7) November 27, 2023
ఇప్పటికే నారా లోకేష్ రాజకీయాలకు పనికిరారనే కామెంట్స్ చేస్తున్న అధికార వైసీపీకి ఈ వీడియోలు మరో అస్త్రంలా మారాయి. వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో నారా లోకేష్ మాట్లాడిన వీడియోలను బాగా వైరల్ చేస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యలపై అటు టీడీపీ నాయకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోవు ఎన్నికల నాటికైనా నారా లోకేష్ లేకుండా మాట్లాడతారేమో చూడాలి.












Click it and Unblock the Notifications