వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్, ఎన్టీఆర్‌లపై లోకేష్ వ్యాఖ్యల కలకలం: సోషల్ మీడియాలో హల్‌చల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో పర్యటించిన సమయంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఈ క్రమంలో నారా లోకేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. నారా లోకేష్ రాజకీయాలపై ఎంతమేర దృష్టి సారిస్తున్నారో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నాయంటూ పలువురు నెటిజన్లు అంటున్నారు. అంతేగాక, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ వదిలేసి పూర్తి సమయాన్ని కేటాయించాలని కోరుతున్నారు.

ఎన్టీఆర్‌ను ఉద్దేశించి కూడానా?

ఎన్టీఆర్‌ను ఉద్దేశించి కూడానా?

లోకేష్ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా ఉన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేశారా? అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల వరకు అన్ని పార్టీలు తమ టీంలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూ. ఎన్టీఆర్ కూడా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం కూడా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్‌కు అవకాశం లేదా?

ఎన్టీఆర్‌కు అవకాశం లేదా?

వచ్చే ఎన్నికల నాటికి జూ. ఎన్టీఆర్‌ సేవలను టీడీపీ ఉపయోగించుకుంటుందా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. పార్టీ కోసం పూర్తి సమయం పని చేసే వారికి తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామని చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీలో మాత్రం పార్ట్ టైమ్ ప్లాట్ ఫాం లేదని స్పష్టం చేశారు లోకేష్.

టీడీపీకి ఎన్టీఆర్ అదనపు బలం

టీడీపీకి ఎన్టీఆర్ అదనపు బలం

నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ యువనేతల్లో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌లో బీజీగా ఉన్న జూ. ఎన్టీఆర్ పూర్తి సమయం పార్టీకి ఎలా కేటాయించగలుగుతారని కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేస్తే తమకు అదనపు బలమే కదా అని ఆయన స్పష్టం చేశారు. కాగా, కొందరు యువనేతలు మాత్రం లోకేష్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలవడం గమనార్హం.

లోకేష్‌కు విజనుంది..

లోకేష్‌కు విజనుంది..

‘లోకేష్‌కు స్పష్టమైన అవగాహణ ఉంది. పూర్తి సమయం కేటాయించి 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పాటుపడతారు' అని ఓ ఎమ్మెల్యే తెలిపారు. ఇది ఇలా ఉండగా, పార్ట్ టైమ్ పాలిటిక్స్‌పై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ను తట్టుకుంటారా..?

పవన్‌ను తట్టుకుంటారా..?

ట్విట్టర్ ద్వారా పవన్ స్పందిస్తేనే.. రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం ఇలాగుంటే.. పూర్తి స్థాయిలో ఆయన రంగంలోకి దిగితే ఏ రాజకీయ పార్టీ ఆయన ముందు నిలవలేదని జనసేన కృష్ణా జిల్లా నేత ఒకరు స్పష్టం చేశారు. పార్ట్ టైమ్ అంటే ఏంటో నారా లోకేష్ నుంచే పవన్ నేర్చుకోవాలని అన్నారు.

English summary
TD general-secretary Nara Lokesh’s remarks on part-timers in politics have become fodder for social media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X