వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైఎస్ జగన్: లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల సీఎం జగన్ చంద్రబాబు , దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ ఏకమైనా తనను ఏమీ చేయలేరని, వెంట్రుక కూడా పీకలేరు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు.

పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?

పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?

గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? అంటూ లోకేష్ జగన్ తీరును ఎద్దేవా చేశారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైయస్ జగన్ గారు మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం అని పేర్కొన్నారు లోకేష్.

ప్రజలే మీ గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు

ప్రజలే మీ గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు

ఇక ఇదే సమయంలో ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు అని లోకేష్ వ్యాఖ్యానించారు. అయినా నా మాట విని మీరేగుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. జగన్ సర్కార్ హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న కారణంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.

వైసీపీ మూర్ఖులారా..మీకు సమయం దగ్గర పడుతోంది

వైసీపీ మూర్ఖులారా..మీకు సమయం దగ్గర పడుతోంది

అంతేకాదు వేళాపాలా లేకుండా కరెంటు తీయడమేంటని ప్రశ్నించడమేనా శావల్యాపురం మండలం కారుమంచి టిడిపి కార్యకర్తలు చేసిన నేరం? అంటూ ప్రశ్నించిన లోకేష్, కరెంట్ కోతలపై ప్రశ్నించినందుకు టిడిపి నేతల రక్తం కళ్లజూసిన వైసీపీ మూర్ఖులారా..మీకు సమయం దగ్గర పడుతోంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికార మదంలోకన్నూమిన్నూ కానడంలేదు అని వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. కానీ..పవర్ కట్ చేస్తున్న మీ జగన్ పవర్ పోతే, మీరు ఏ ఊర్లో వుంటారు? మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడు? అంటూ లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

జాలీ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో చెప్పిన లోకేష్

జాలీ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో చెప్పిన లోకేష్

హాలిడే సీఎం జాలీ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో... క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్హాలిడేలతో శాశ్వతంగా రాష్ట్రంలో అభివృద్ధికి హాలిడే అంటూ లోకేష్ జగన్ పాలనలో రైతులు పంటలు పండించడం లేదని, పవర్ హాలిడే లు ప్రకటించడంతో పరిశ్రమలు నడవడం లేదని, జాబ్ హాలిడే లతో నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారని మొత్తంగా రాష్ట్రంలో అభివృద్ధికి శాశ్వత హాలిడే జగన్ పాలనలో కల్పిస్తుందని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+