వంశీ ఇలాకాలో నారా లోకేశ్, మిషన్ 2024 - ఉత్కంఠ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం పీక్ కు చేరింది. టీడీపీకి రానున్న ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ గా మారుతోంది. అదే సమయంలో టీడీపీకి కొందరు నేతలను ఈ సారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. అందులో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేసారు. ఇప్పుడు జిల్లాలోకి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశిస్తోంది. యాత్ర వేళ గన్నవరంలో నారా లోకేశ్ బస, సభ లో పాల్గొననుండటంతో ఉత్కంఠ పెంచుతోంది.
కృష్ణా జిల్లాలోకి లోకేశ్ యాత్ర : ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు సీట్లకు పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తమకు పట్టు కున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు నారా లోకేశ్ యాత్ర పైన జిల్లా టీడీపీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. సక్సెస్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 19వ తేదీ మధ్నాహ్నం లోకేశ్ యువగళం యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కి ప్రవేశిస్తుంది. 19,20,21 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించి పార్టీ నేత కేశినేని చిన్ని యాత్ర షెడ్యూల్ ను వెల్లడించారు. పార్ట్టీ నేతలంతా కలిసి యాత్ర సక్సెస్ చేస్తారని చెప్పుకొచ్చారు. జిల్లాలో మొత్తం అయిదు నియోజకవర్గాల్లో లోకేశ్ యాత్ర కొనసాగనుంది.
మూడు రోజుల పాదయాత్ర : 19న విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో లోకేశ్ యాత్ర కొనసాగనుంది. సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధా, బోండా ఉమ మధ్య పోటీ నెలకొని ఉండటంతో అక్కడ లోకేశ్ యాత్ర పైన ఆసక్తి కొనసాగుతోంది. అదే విధంగా 20న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ యాత్ర నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసారు.
తూర్పు నుంచి పెనమలూరులోకి యాత్ర ప్రవేశిస్తుంది. 20వ తేదీ రాత్రి గన్నవరం లో లోకేశ్ బస చేయనున్నారు. 21న గన్నవరంలో పాదయాత్ర..భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసారు. లక్ష మందితో ఈ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా గన్నవరం నియోజకవర్గంలో తమ బలం చాటాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.

గన్నవరం లో సభపై ఉత్కంఠ : ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరంతో పాటుగా గుడివాడ ను టీడీపీ లక్ష్యంగా చేసుకుంది. ఎలాగైనా కొడాలి నాని, వల్లభనేని వంశీని ఓడించాలని భావిస్తోంది. యాత్ర సమయం కుదించటంతో గన్నవరం తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తోంది. అయితే, గన్నవరంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి ఎవరికి దించుతారనేది ఆసక్తి కరంగా మారింది.
ప్రస్తుత వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. వైసీపీ తమ అభ్యర్ధిగా వంశీని బరిలోకి దించనుంది. ఈ సమయంలో గన్నవరంలో వంశీ లక్ష్యంగా లోకేశ్ ఏం మాట్లాడుతారు.. వంశీ మద్దతు దారుల నుంచి స్పందన ఎలా ఉంటుంది..రాజకీయంగా పరిణామాలు ఎంటా ఉంటదయనే ఉత్కంఠ నియోజకవర్గంలో కనిపిస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications