TDP Mahanadu: మహిళలకు లోకేష్ భారీ గుడ్ న్యూస్..! మోడీతో సంబంధం లేకుండానే..!

ఏపీలో మహిళామణులకు టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. పార్టీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చట్టసభలకు కూడా విస్తరిస్తూ టీడీపీ మహానాడు వేదికగా కీలక నిర్ణయం ప్రకటించారు. పార్లమెంటులో పెండింగ్ ఉన్న రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లు కేటాయించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా, అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నారా లోకేష్ మహానాడులో పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలని కోరారు. ఈ పవిత్ర మహానాడు వేదిక నుండి తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో లోకేష్ తెలిపారు. లోకేష్ ప్రవేశపెట్టిన ఈ చారిత్మాత్మక తీర్మానంతో మహానాడు వేదిక మారుమోగింది.

Nara Lokesh Vows 33 Seats for Women in 2029 Elections Independent of Parliament s Reservation Bill

రాష్ట్రంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% సీట్లను కేటాయించాలని, ఇది కేవలం ఒక నినాదంగా కాదు.. భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలని లోకేష్ తెలిపారు. తమకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు, మహిళా నాయకులు, మహిళా విధాన నిర్ణేతలు కావాలన్నారు. టీడీపీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారన్నారు. ఇది తమ సంకల్పం, బాధ్యత, కమిట్ మెంట్ అని లోకేష్ తెలిపారు. భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని తాను గట్టిగా నమ్ముతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు. మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదని, నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+