సాధ్యం కాదు: ఏపీ రెండో రాజధానిపై మంత్రి నారాయణ

హైదరాబాద్: 21వ శతాబ్దంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించే తొలి రాజధాని ఆంధ్రప్రదేశ్‌దే అవుతుందని మంత్రి పీ నారాయణ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ ఒకేచోట ఉండాలని, రాష్ట్రానికి రెండో రాజధాని సాధ్యం కాదని చెప్పారు. రాజదాని నిర్మాణ సలహా కమిటీ తొలి ప్రాథమిక సమావేశం మంత్రి నారాయణ అధ్యక్షతన శనివారం జరిగింది.

ఈ ప్రాథమిక సమావేశంలో రాజధాని ప్రాంతం, భూముల విషయాన్ని పక్కన పెట్టి కేవలం అభివృద్ధి నమూనా పైనే చర్చించారు. నూతన రాజధాని అధ్యయనానికి ఏయే ప్రాంతాల్లో పర్యటించాలో గుర్తించారు. పర్యటనలకు అయ్యే ఖర్చును సభ్యులు వ్యక్తిగతంగా భరించాలని, ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహకాలు, డబ్బు తీసుకోకుండదని నిర్ణయించారు.

Narayana on second capital of Andhra Pradesh

మంత్రి పీ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో రాజధానుల అధ్యయానికి వచ్చే నెలలో కమిటీ అధ్యయన పర్యటనకు వెళ్తుందని చెప్పారు. ఈ పర్యటనకు అయ్యే ఖర్చు కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా భరిస్తారన్నారు. మెకెన్సీ సంస్థ 12 వారాల పాటు ఉచిత కన్సల్టెన్సీని ఇచ్చేందుకు అంగీకరించిందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు.

ఉచిత కన్సల్డెన్సీ ఇచ్చేందుకు ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చిన మూడు నెలల్లోనే రాజధాని నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు. గుంటూరు - విజయవా ప్రాంత అన్ని ప్రాంతాలకు మధ్యలో కేంద్రీకృతమై ఉంటుందన్నారు. రాజధాని స్థలం ఎంపిక విషయంలో ప్రస్తుతం ప్రభుత్వ, అటవీ భూముల లభ్యత, భూసేకరణ చట్టం ద్వారా భూముల సేకరణ, నోయిడా తరహాలో భూముల సమీకరణ విధానాలను అధ్యయనం చేస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+