జోరు వానలో మోడీ స్పీచ్: కమలాల మాలతో(పిక్చర్స్)
విశాఖపట్నం: స్వర్ణాంధ్ర కావాలో, స్కామాంధ్ర కావాలో విశాఖపట్నం జిల్లా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోరారు. స్వర్ణాంధ్ర కావాలంటే బిజెపి-తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీమాంధ్ర అభివృద్ధి బాధ్యత తనదేనని అన్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.
ఓ వైపు హోరున గాలి.. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయక ఆయన తన ప్రసంగాన్ని అనర్గళంగా కొనసాగించారు. విశాఖ పోర్టును దేశంలో అతిపెద్ద ఓడ రేవుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎంతో సుందరమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. వర్షంలో తడిసి ముద్దయిన మోడీ సుమారు 20 నిముషాలు ప్రసంగించారు. అప్పటికే పెద్ద ఎత్తున గాలి వీస్తోంది. ఇంతలో వేదికమీదకు మోడీ రావడంతో జనం అంతా మోడీ గాలి.. అంటూ నినాదాలు చేశారు.
మోడీతోపాటు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడ్డానికి ముందే మోడీ మాట్లాడేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షంలో కూడా మోదీ తన ప్రసంగాన్ని ఆపలేదు. మోదీ ప్రసంగం వినేందుకు భారీగా అక్కడికి చేరుకున్న జనం వర్షం వల్ల మోడీ ప్రసంగించరేమోనని అనుకున్నారు. ఆయనే వర్షంలో మాట్లాడుతుండడంతో సభికులు కూడా అక్కడి నుంచి కదలకుండా మోడీ ప్రసంగాన్ని విన్నారు. మోడీ ప్రసంగాన్ని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలుగులోకి అనువాదం చేశారు.

మోడీకి కమలం పువ్వుల దండ
విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.

జోరు వానలో మోడీ ప్రసంగం
స్వర్ణాంధ్ర కావాలో, స్కామాంధ్ర కావాలో విశాఖపట్నం జిల్లా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోరారు.

మోడీతో వెంకయ్య మంతనాలు
స్వర్ణాంధ్ర కావాలంటే బిజెపి-తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాలని మోడీ పిలుపునిచ్చారు.

నేతల అభివాదం
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీమాంధ్ర అభివృద్ధి బాధ్యత తనదేనని నరేంద్ర మోడీ చెప్పారు.

వర్షం రావడంతో గొడుగునీడలో..
ఈదురు గాలులతో కూడిన వర్షంలో కూడా మోదీ తన ప్రసంగాన్ని ఆపలేదు. మోదీ ప్రసంగం వినేందుకు భారీగా అక్కడికి చేరుకున్న జనం వర్షం వల్ల మోడీ ప్రసంగించరేమోనని అనుకున్నారు. ఆయనే వర్షంలో మాట్లాడుతుండడంతో సభికులు కూడా అక్కడి నుంచి కదలకుండా మోడీ ప్రసంగాన్ని విన్నారు.












Click it and Unblock the Notifications