ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం: ఉప ఎన్నికలకు నో ఛాన్స్, బస్సుయాత్ర
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఏప్రిల్ 6వ తేదీన వీరు ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామా చేశారు. రెండు నెలలకు పైగా పరిశీలించిన స్పీకర్ ఇప్పుడు ఆమోదించారు. బుధవారం(20 జూన్ 2018)న రాజీనామాలు ఆమోదించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.
Recommended Video

మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి రాజీనామాలు నిన్నటి (బుధవారం) నుంచి అమలులోకి వచ్చాయి. అయితే ఎన్నికలకు ఏడాదిలోపు ఉండటంతో ఉప ఎన్నికలు రావని చెబుతున్నారు. ఎంపీలు బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.

రాజీనామాల కోసం వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను రెండుమూడు సార్లు కలిశారు. ఈ నెల 6వ తేదీన కూడా ఆమెను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని చెప్పారు. కానీ స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు ఆమోదించారు.
జూన్ 6న వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ రాజీనామాలను ఆమోదించారని తెలిపారు. అలాగే, పార్టీ మారిన మరో ముగ్గురు తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications