మూడు, నాలుగు రోజుల్లో శుభవార్త-రఘురామలో అదే ధీమా..! కారణమిదేనా..?
ఏపీలో ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీయే కూటమి పార్టీలు.. అదే వైసీపీని తమతో పాటు గత ఐదేళ్లుగా వ్యతిరేకిస్తున్న రఘురామకృష్ణంరాజుకు ఎలాగైనా టికెట్ కేటాయిస్తాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో రఘురామకు బదులుగా బీజేపీ నేత శ్రీనివాస వర్మకు నరసాపురం టికెట్ ఇచ్చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రఘురామ తనదైన శైలిలో లాబీయింగ్ ను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ మరోసారి విజయవాడ వచ్చారు.
ఇవాళ విజయవాడ వచ్చేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రఘురామరాజుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన రఘురామ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు టికెట్ వస్తుందని రఘురామ ధీమాగా చెప్పారు. మూడు నాలుగురోజుల్లో మంచి వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు టికెట్ల ప్రకటనలు పూర్తయినా నరసాపురం టికెట్ పై రఘురామరాజు ధీమా వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. నరసాపురం టికెట్ దక్కదని తొలుత ఫిక్స్ అయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానంటూ ప్రకటనలు చేసిన ఆయనకు ఆ తర్వాత చంద్రబాబు ఫోన్ చేసి బుజ్జగించినట్లు తెలుస్తోంది.
అనంతరం అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి రఘురామకు నరసాపురం ఇస్తే.. మీకు ఏలూరు ఎంపీ ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా తాను మాట్లాడి చెబుతానని చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అందుకే రఘురామ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త అంటున్నారు.












Click it and Unblock the Notifications