జగన్ ను "ఫిక్స్" చేస్తున్న కూటమి - "డిక్లరేషన్" కు సిద్దమేనా..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. లడ్డూ వివాదం వేళ జగన్ ను ఫిక్స్ చేసేందుకు కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. ఈ నెల 28న శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే, ఇప్పుడు కూటమి నేతల డిమాండ్ కు జగన్ అంగీకరిస్తారా..ఏం జరుగుతోంది.

తిరుమలకు జగన్
తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఆ అంశం రాజకీయ వివాదంగా మారింది. చంద్రబాబు రాజకీయం కోసం తిరుమల లడ్డూ అంశం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ అంశం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 27న జగన్ తిరుమల చేరుకుంటారు. 28వ తేదీ ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే, జగన్ పర్యటన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

NDA leaders Demands YS Jagan declaration before Srivari Darshan in his Tirumala visit

డిక్లరేషన్ ఇవ్వాలి
జగన్ తిరుమల పర్యటన వేళ కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. జగన్ తిరుమల పర్యటన కు తనకు శ్రీవారి పైన నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో సహా బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే విధంగా మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఇదే డిమాండ్ చేసారు. జగన్ గతంలో తిరుమల సందర్శన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని అంశాన్ని తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు సైతం ప్రస్తావించారు.

జగన్ నిర్ణయం ఏంటి
ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. జగన్ 2018లో తన పాదయాత్ర ముగిసిన తరువాత కాలి నడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు శ్రీవారి దర్శనంతో పాటుగా..బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు లడ్డూ వివాదం వేళ జగన్ మరోసారి జగన్ డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది. జగన్ అన్యమతస్తుడు కావటంతో డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లాలని పురందేశ్వరి డిమాండ్ చేసారు. దీంతో..ఇప్పుడు జగన్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+