కడప పోలీసులు వేధిస్తున్నారు: హైద్రాబాద్‌లో నటి నీతూ అగర్వాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి నీతూ అగర్వాల్ మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఎర్ర చంనదం స్మగ్లింగ్‌తో ఎలాంటి సంబంధాలు లేని తన బంధువులను కూడా పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు.

ఆళ్లగడ్డ కోర్టుకు నీతు అగర్వాల్, కీలక సమాచారం రాబట్టారా?

కడప, పొద్దుటూరు పోలీసులు అకారణంగా తన ముగ్గురు బంధువులను అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు.

tu agarwal

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నీతూ అగర్వాల్ అరెస్టై జైలుకు వెళ్లారు. బెయిల్ పైన బయట ఉన్నారు. హైదరాబాదులోని బీరంగూడ ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు. హైదరాబాదులోనే మీడియాతో మాట్లాడారు.

బయటపడగానే అందరి పేర్లు చెప్తా, తిండి పెట్టా: నీతూ

స్మగ్లర్ కందస్వామి అరెస్ట్

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 638 కిలోల బరువున్న 21 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Neetu Agarwal alleges police harassing her relatives.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి