బాబు సమక్షంలో టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన డీసీసీబీ బ్యాంకు అధ్యక్షుజు ధనుంజయ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డితో పాటు ఇతర నేతలు చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జిల్లా మత్రి నారాయణతో పాటు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులైన టీడీపీలో చేరుతున్నట్లు నేతలు చెప్పారు.
ఏపీ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా విభజన: దేవినేని

ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా విభజన చేశారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా అన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే ప్రజలు పట్టం కట్టారన్నారు. రాజధాని నిర్మాణంలో అందరం భాగస్వాములం అవుదామన్నారు.
తుఫాను బాధితులకు జోలె పట్టిన గల్లా
హుధుద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం జోలె పట్టిన మాజీ మంత్రి, తెలుగుదేశం చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి గల్లా అరుణ కుమారి రూ.2.73 కోట్లు సేకరించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పల్లెపల్లెకూ తిరిగిన అరుణ, తుఫాను బాధితులకు బాసటగా నిలవాలని ప్రజలకు సూచించారు. జోలె పట్టిన అరుణ కుమారికి పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. దీంతో ప్రజలతో పాటు చంద్రగిరికి చెందిన ఎన్నారైల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications