మెడకు ఉరి.. ప్రియుడి కోసం ఆక్రందన.. సంచలనంగా డిగ్రీ విద్యార్థిని సూసైడ్.. నిందితులతో ఆమె సోదరుడు..
''నిన్ను చూడకుంటే నాకు మెంటలెక్కిపోతోంది... ప్లీజ్ రా.. ఫోన్ లిఫ్ట్ చెయ్.. నాతో ఒక్కసారి మాట్లాడు.. శివా.. నువ్వు ఫోన్ ఎత్తకుంటే.. నేను స్టూల్ ఎక్కుతా.. నువ్వు మాట్లాడకుంటే నేను ఉరిపోసుకుని చస్తా... ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు..'' అంటూ గంటన్నర వ్యవధిలో వందల మెసేజ్ లు పంపింది. ఆమె ఎంతగా ప్రాధేయపడినా ప్రేమికుడు వినిపించుకోలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయానని గ్రహించిన ఆమె చివరిగా వీడియో కాల్ చేసి, అతను చూస్తుండగానే ఉరి బిగించుకుంది.

జిల్లాలో సంచలనం..
నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ సెల్ఫీ సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు సిటీలోని బీవీనగర్‌లో ఉంటున్న వెంకటరాజు, సుబ్బమ్మ దంపతుల కుమార్తె రమ్య(21) ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. వాళ్ల ఇంటికి సమీపంలో ఉండే శివభార్గవ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించిన శివ.. చివరికి మోహం చాటేయడంత బలవన్మరణానికిపాల్పడింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శివభార్గవ్, మరో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.

గంటన్నరలో వందల మెసేజ్‌లు..
కొంతకాలంగా తనను దూరంపెడుతోన్న శివతో తాడోపేడో తేల్చుకోవాలనుకున్న రమ్య.. శుక్రవారం అతనితో మాట్లాడేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వందలకొద్ది మెసేజ్ లు పంపింది. ఒక్కసారి మాట్లాడాలంటూ ప్రాధేయపడినా, అటు నుంచి ఎంతకూ సమాధానం రాలేదు. దీంతో శివ స్నేహితులైన వాసు, సాయిలకు కూడా మెసేజ్ లు పంపింది. చివరి అస్త్రంగా.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో కాల్ చేసింది. శివ చూస్తుండగానే మెడకు ఉరి బిగించుకుని, మాట్లాడాలంటూ ప్రాధేయపడుతూనే, స్టూల్ తన్నేసింది..

ఆ ముగ్గురిపై ఫిర్యాదు..
గదిలోకి వెళ్లిన కూతురు ఎంతకూ బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. రమ్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి, రమ్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ వెంటనే జిల్లా ఎస్పీ ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను ఆశ్రయించిన బాధిత కుటుంబం.. రమ్య పంపిన మెసేజ్‌లు, వీడియోలను ఆధారాలుగా పేర్కొంటూ, శివ, అతని ఇద్దరు స్నేహితులపై ఫిర్యాదు చేశారు. రమ్య సూసైడ్ సెల్ఫీ, శివ, చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ సమయంలో తమ్ముడు అక్కడే..
ఒకే కాలనీ కావడంతో నిందితులు ముగ్గురికీ రమ్యతోపాటు ఆమె సోదరుడితోనూ పరిచయం ఉంది. మాట్లాడకపోతే చనిపోతానంటూ రమ్య వీడియో కాల్ చేసి, ఉరి బిగుంచుకున్న సమయంలో.. శివ పక్కనే ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. కానీ ఆమె చనిపోవడాన్ని కళ్లారా చూసి కూడా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. ‘‘ఆ టైమ్ ను నేను కూడా వాళ్లతోనే ఉన్నాను. ఒక్కమాట చెప్పినా మా అక్క ప్రాణాలు కాపాడుకునేవాడిని..''అని రమ్య సోదరుడు వాపోయాడు.
Recommended Video

గాలింపు ముమ్మరం..
రమ్య ప్రాణాలు కోల్పోయిందని, ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారని తెల్సుకున్న వెంటనే మోసగాడు శివభార్గవ్ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అన్నీ చానెళ్లలోనూ వార్తలు ప్రసారం కావడంతో నెల్లూరు మొత్తం ఈ కేసు గురించే చర్చించుకుంది. బాధిత కుటుంబానికి మద్దతుగా స్థానికులు, బంధువులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పరారీలో ఉన్న శివభార్గవ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తెస్తామని నెల్లూరు పోలీసులు చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications