అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిలక జోస్యం మంత్రిగా నారాయణ: వైసీపీ ఎమ్మెల్యే ఎద్దేవా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు పట్టణ సమస్యలపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లు పూర్తి అయినా జిల్లాకు ఇంత వరకు ఒక్క పైసా నిధులు తేలేదని అన్నారు.

నగరానికి నిధులు తీసుకురాలేకపోయిన నారాయణను కళాశాలల అధినేతగా, మంత్రిగా చూశామని ... ఇప్పుడు ఆయన చిలకజోస్యం మంత్రిగా మారాడని ఆయన మండిపడ్డారు. ఒకానొక సందర్భంలో నన్ను ఒక వైపే చూశారు.. రెండో వైపు చూడలేదు.. అని మంత్రి అంటే అది ఏమిటోననుకున్నానని ఆయన రెండో వైపు చిలక జోస్యమేనా? అని ఎద్దేవా చేశారు.

పేదలకు ఇళ్లు కట్టించండని తాము డిమాండ్‌ చేస్తుంటే కట్టిన ఇళ్లను వాళ్లు కూలుస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి నారాయణ చిలక జోస్యం చెప్పుకోవడం మాని ఎస్ఎస్ ట్యాంకు నుంచి ప్రజలకు మంచినీటి సరఫరా చేయించాలని కోరారు.

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

టీడీపీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా వైఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన పార్టీ బహిరంగ సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ వైయస్ ఆశయ సాధన కోసం వైసీపీ పనిచేస్తోందని ఆయన తెలిపారు.

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

ఏపీలో రైతులకు కనీసం రూ. 10 వేల కోట్ల రుణమాఫీ అయినా జరిగిందంటే.. అది కేవలం వైఎస్ జగన్ చేసిన పోరాటం వల్లేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయడానికి బదులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు.

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి దానిని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాపట్ల తహసీల్దారుకు వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

చిలక జోస్యం మంత్రిగా నారాయణ

బాపట్లలో జరిగిన ఈ బహిరంగ సభలో ధర్మాన ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

English summary
Nellore rural mla kotamreddy sridhar reddy on minister narayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X