దేశంలో అత్యంత ధనిక రైల్వేస్టేషన్... బాగా రిచ్

భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు క్రమక్రమంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతోంది. ప్రతిరోజు 13వేల రైళ్లద్వారా దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సరకు రవాణాద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణికులద్వారా కూడా భారీ ఆదాయాన్ని రైల్వే ఆర్జిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 7వేల రైల్వేస్టేషన్లద్వారా ఈ ఆదాయం సమకూరుతోంది. సరకు రవాణా తర్వాత స్టేషన్ల నుంచి వచ్చే ఆదాయమే రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు.

రూ.3337 కోట్ల ఆదాయం వస్తోంది
రైల్వేస్టేషన్లలో టికెట్లద్వారా మాత్రమే కాకుండా ప్లాట్ ఫారం టికెట్లు, వెయిటింగ్ రూమ్స్, క్లోక్ రూమ్స్, ప్రకటనలు, దుకాణాల నుంచి వచ్చే అద్దెలు.. ఇలా అనేక రూపాలద్వారా స్టేషన్ కు ఆదాయం సమకూరుతుంటుంది. ఇలా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వేస్టేషన్ల వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లకన్నా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ మొదటి స్థానంలో ఉంది న్యూఢిల్లీ రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ నుంచి భారతీయ రైల్వేకు రూ.3,337 కోట్ల ఆదాయం వస్తుంది.

New Delhi Railway Station is earning high revenue in India

విజయవాడకు కూడా చోటు దక్కింది
న్యూఢిల్లీ తర్వాత హౌరా (కోల్ కతా) రైల్వేస్టేషన్ రెండోస్థానంలో నిలుస్తుంది. ఈ స్టేషన్ నుంచి భారతీయ రైల్వేకు రూ.1692 కోట్ల ఆదాయం సమకూరుతోంది. న్యూఢిల్లీ, హౌరా తర్వాత మూడోస్థానంలో చెన్నై సెంట్రల్ స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ నుంచి ఏడాదికి రూ.1299 కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న స్టేషన్లను నాన్ సబర్బన్ గ్రూప్ క్రిందకు చేరుస్తారు. ఇలా దేశవ్యాప్తంగా 28 స్టేషన్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ రైల్వే జంక్షన్ గా ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్ కూడా తాజాగా నాన్ సబర్బన్ గ్రూప్ లోకి చేరింది. ఈ స్టేషన్ నుంచి రూ.528 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా NSG-1 జాబితాలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+