మన శ్రీసిటీలో రూపుదిద్దుకున్న డ్రైవర్ లెస్ మెట్రో రైలు: ఆక్వా లైన్ లో పరుగులు
ముంబై మెట్రో కోసం మొట్టమొదటి డ్రైవర్‌లెస్ మెట్రోపొలిస్ రైలు సిద్ధమైంది. రైల్వే వ్యాగన్ల తయారీ సంస్థ ఆల్స్టోమ్ దీన్ని తయారు చేసింది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో 14 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ అత్యాధునిక రైలుకు తుదిరూపాన్ని ఇచ్చింది. ముంబై మెట్రో నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా దీనని రూపొందించిందా సంస్థ. ఈ రైలుకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో ఈ డ్రైవర్ లెస్ ట్రైన్ రూపుదిద్దుకుంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్, విద్యుత్ సరఫరా, ట్రాక్ నిర్మాణం వంటి పనులను ఎల్ అండ్ టీ నిర్వహిస్తోంది. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా ఆల్స్టోమ్ సంస్థ మొత్తం 39 డ్రైవర్ లెస్ మెట్రోపొలిస్ రైళ్లను సరఫరా చేయనుంది. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, డిపో నిర్మాణం, అయిదేళ్ల కాలానికి అవసరమైన నిర్వహణ బాధ్యతను కూడా ఎల్ అండ్ టీ తీసుకోనుంది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆల్స్టోమ్ ప్లాంట్ల భాగస్వామ్యంతో ఈ రైలు ప్రాణం పోసుకుంది. బెంగళూరులో రైళ్ల ఇంజినీరింగ్ డిజైన్ రూపుదిద్దుకోగా, కోయంబత్తూరులో ట్రాక్షన్ సిస్టమ్స్, గుజరాత్ సావ్లీ యూనిట్ లో బోగీలను తయారు చేశారు. వీటన్నింటినీ శ్రీసిటీ ప్లాంట్‌కు తరలించి ఒకే చోట పూర్తిస్థాయి రైలుగా అసెంబుల్ చేశారు. 14 నెలల వ్యవధిలో ఆయా పనులన్నీ కూడా పూర్తి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నూతన మెట్రోపొలిస్ రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా రూపుదిద్దుకున్నాయి. ట్రాక్ పై మాత్రం 80 కిలోమీటర్లకే పరిమితం చేనున్నారు. పర్యావరణానికి గుర్తుగా ఈ రైళ్లకు ఆకుపచ్చ, నీలం రంగులను వేశారు. ముంబై వాతావరణానికి అనుగుణంగా ఈ రైలు తయారైంది. కూలింగ్, అత్యాధునిక వెంటిలేషన్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: New driverless-ready metro trains manufactured by Alstom for Mumbai Metro Lines 4 and 4A. L&T and Alstom to supply 39 six-car trainsets, with a planned 90-second headway. (30.10) https://t.co/J0wy9mKkcQ
— ANI (@ANI) October 30, 2026
సైకిళ్ల కోసం ప్రత్యేకంగా బైసైకిల్ స్పేస్ ను కల్పించడం విశేషం. మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు సైకిల్ మీద వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితో పాటు దివ్యాంగులను వీల్ ఛైర్లపై సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా ప్రత్యేక ర్యాంప్ వసతిని ఏర్పాటు చేశారిందులో. ముంబై మెట్రో ఆక్వా లైన్లతో పరుగులు పెట్టనుందీ డ్రైవర్ లెస్ ట్రైన్. లైన్ 2, లైన్ 7 సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ సిస్టమ్ ను కూాడా ఆల్స్టోమ్ అందించనుంది.












Click it and Unblock the Notifications
