ఏపీలో కేంద్ర బృందాల వరుస పర్యటనలు

ఏపీని వణికించిన ఆర్ణబ్ తుఫాను నష్ట తీవ్రత క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి రెండు కేంద్ర బృందాలు నేడు, రేపు వేర్వేరుగా రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. ఆస్తి, వ్యవసాయ నష్టాలను నేరుగా అంచనా వేయనుంది. బాధితులకు తగిన సహాయం అందించడానికి, రాష్ట్రానికి అవసరమైన విపత్తు ఉపశమన నిధులను ఖరారు చేయడానికి ఈ అధ్యయనం కీలకం కానుంది.

తుఫాన్ తో పాటు ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కరువు పరిస్థితులను కూడా ఈ రెండు బృందాలు అంచనా వేయనున్నాయి. వీటి పర్యటన ఈ ఉదయం అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్‌, ఇతర ఉన్నతాధికారులు బృందంప్రతినిధులతో సమావేశమౌతారు. తుఫాను సమయంలో ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సహాయక చర్యలు, నష్టం తీవ్రతపై అధికారులు ఓ నివేదికను అందిస్తారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు.

Central Teams to Visit Andhra Pradesh to Assess Cyclone Arnab Damage and Drought Situtation in State

ఈ భేటీ ముగిసిన వెంటనే కేంద్ర ప్రతినిధుల బృందం రెండు ప్రత్యేక విభాగాలుగా విడిపోయి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరుతుంది. ఒక టీమ్ కు ప్రఖర్ జైన్ మార్గదర్శకత్వం వహిస్తారు. రెండో బృందంలో హెల్త్ డైరెక్టర్ చక్రధర బాబు ఉంటారు. నేడు, రేపు కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తాయి ఈ రెండు బృందాలు. పంట నష్టాన్ని అంచనా వేస్తాయి.

తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం

ఇందులో ప్రశాంత్ ఆర్మొరికర్, రేఖరాణి కొల్లు, హిమాలయ్ గర్గ్, రాకేష్ కుమార్ సింగ్, అలోక్ జవహర్, ప్రణయ్ గర్గ్, డాక్టర్ ఎస్వీఎస్పీ శర్మ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర వ్యవసాయం, జల్ శక్తి, ఆర్థికం, రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ మంత్రిత్వ శాఖల అధికారులు వారంతా. ఎస్వీఎస్పీ శర్మ.. ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ శాస్త్రవేత్త.

మరో బృందం సోమ, మంగళవారాల్లో రాయలసీమ జిల్లాల్లో పర్యటించనుంది. అక్కడ వర్షాభావ పరిస్థితులు, ఖరీఫ్ పంటను పరిశీలిస్తుంది. ఇందులో ప్రభా కాంతి, వినోద్ సామంత్, పంకజ్ పహాడియా, ఎన్వీ సతీష్ చీమకుర్తి, డాక్టర్ కే పొన్నుస్వామి, అనురాధ బటానా, ధీరేంద్ర కుమార్, ప్రదీప్ కుమార్, డాక్టర్ సాక్షి భదౌరియా ఉన్నారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మయ్ గోట్మారే నేతృత్వం వహిస్తారు. ఈ బృందం శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+