'భారత్ సమ్మిట్' లో గిగ్ వర్కర్స్ పాలసీ ఆవిష్కరణకు రాహుల్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

భారత్ సమ్మిట్ ను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, అనువైన వాతావరణం నేపథ్యంలో ఈ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని ప్రపంచానికి చాటిచెప్పడానికే ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈరోజు, రేపు రెండు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి బోధి పెవిలియన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలమైన పరిస్థితులను ప్రపంచానికి వివరించేందుకు ఈ భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.

CM Revanth Reddy Unveils Bharat Summit amp amp Gig Workers Policy Details Telangana Positioned as Global Investment Hub

గతేడాది కూడా భారత్ సమ్మిట్‌ను నిర్వహించామని తెలియజేస్తూ, పెట్టుబడులను ఆహ్వానించడంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతోందన్నారు.భారత్ సమ్మిట్‌కు జాతీయ స్థాయిలోనే కాకుండా దాదాపు 70 దేశాలకు చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రతినిధులు, మంత్రులు, పర్యావరణవేత్తలు, పెట్టుబడిదారులు, జర్నలిస్టులు, సుమారు వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు.

రెండు రోజులపాటు వివిధ సెమినార్లు నిర్వహించి, తీర్మానాలు చేయడం ద్వారా తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని చాటిచెప్పాలనుకున్నామని వివరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రతినిధులు భారత్ సమ్మిట్ నుంచి తిరిగివెళ్లేప్పుడు వారు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా పర్యావరణం, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, మానవ వనరులు, వాతావరణం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు.

ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, సదస్సుల్లో అందరి అభిప్రాయాలను తెలుసుకుని అందులో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తామని చెప్పారు.దేశంలో గిగ్ వర్కర్స్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ప్లాట్‌ఫామ్ వర్కర్లు, కొరియర్లు, డ్రైవర్లు, ఇళ్లల్లో పనిచేసే వారు, ఇతర కార్మికులకు ఎలాంటి రక్షణ లేదని చెప్పారు. వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు.

గిగ్ వర్కర్స్ పాలసీని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలిపారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌లో కూడా రాహుల్ గాంధీ గారు తన సందేశం వినిపిస్తారని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించి దానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని ఆహ్వానించామని గుర్తుచేస్తూ, గతంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని దేశ ప్రతినిధిగా విదేశాలకు పంపించిన సందర్భాన్ని గుర్తుచేశారు.సమ్మిట్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం సమర్థనీయం కాదని అన్నారు. అర్థరహితమైన ఆరోపణలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా యూనివర్సిటీలలో భారీ ఉద్యోగాల భర్తీ త్వరలోనే.. లేటెస్ట్ అప్డేట్!
తెలంగాణా యూనివర్సిటీలలో భారీ ఉద్యోగాల భర్తీ త్వరలోనే.. లేటెస్ట్ అప్డేట్!

భారత్ సమ్మిట్ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమ్మిట్‌పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, తెలంగాణ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాంస్కృతికంగా, సాంకేతికంగా హైదరాబాద్ ఎదిగిందని తెలియజేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడ్డుపడొద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+