నోట్లో రసగుల్లా పేలి వ్యక్తి మృతి..!!

రసగుల్లా రూపంలో ఉన్న నాటుబాంబు నోట్లో పేలడంతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మృతుడిని దిండోరి జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాజేంద్ర బరౌతియాగా పోలీసులు గుర్తించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది విద్యార్థులు దుర్మరణం!
ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది విద్యార్థులు దుర్మరణం!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి దిండోరి జిల్లాలోని ఓ గ్రాంలో రాజేంద్ర బరౌతియాతో పాటు మరికొందరు గ్రామస్థులు చలిమంట వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడికి రసగుల్లా ఆకారంలో ఉన్న పదార్థాన్ని తీసుకురాగా.. మరొకరు దాన్ని రాజేంద్రకు తినమని ఇచ్చారు. సాధారణంగా రసగుల్లాను ఒకేసారి నోట్లో వేసుకుని తింటుంటారు. అలాగే రాజేంద్ర కూడా దాన్ని స్వీట్ అనుకుని నోట్లో వేసుకోగానే ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రాజేంద్ర ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Man Dies After Rasgulla-Shaped Crude Bomb Explodes in His Mouth in Madhya Pradesh Full Details Here
శ్రేయస్ అయ్యర్ బ్లండర్.. తొలి ఓవర్లోనే టీమిండియా కథ క్లోజ్!
శ్రేయస్ అయ్యర్ బ్లండర్.. తొలి ఓవర్లోనే టీమిండియా కథ క్లోజ్!

అడవి పందుల వేటకు తయారు చేసిన నాటుబాంబు
గ్రామీణ ప్రాంతాల్లో కొందరు గిరిజనులు అడవి పందులను వేటాడేందుకు పిండి ముద్దల్లో గన్ పౌడర్ నింపి ఇలాంటి నాటుబాంబులను తయారు చేస్తుంటారు. చూడటానికి అవి అచ్చం రసగుల్లా మాదిరిగా ఉంటాయి. ఈ ఘటనపై పోలీసు అధికారి రేఖా సింగ్ మాట్లాడుతూ.. అడవి పందులను చంపడానికి ఉపయోగించే నాటుబాంబు వల్ల బాధితుడికి ఇచ్చారని.. అది అతని నోట్లోనే పేలిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అతడిని చంపాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారా, లేక ఏదైనా ఆకతాయితనంతో ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+