పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ:CII సదస్సులో రూ.9.98లక్షల కోట్ల భారీ పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేవలం ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి, పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రాష్ట్ర యువత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త అయినా రావాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఈ సదస్సు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం పేర్కొన్నారు. సదస్సులో భాగంగా వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో ఏకంగా 194 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రాష్ట్రానికి రూ.9.98 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయని ఆయన వెల్లడించారు.ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.

CM Chandrababu Announces 9 98 Lakh Crore MoUs at Visakhapatnam CII Summit AP Emerges as Top Investment Hub

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ వేగం మరే రాష్ట్రానికీ సాధ్యం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.జూన్ 2024 నుంచి ఈ సమ్మిట్‌కు ముందు వరకు 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. వాటిలో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపామన్నారు. వాటి పెట్టుబడి విలువ రూ.17.10 లక్షల కోట్లు. వీటి ద్వారా 12.9 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు.

ఇప్పటికి 303 ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయిందని, వీటి పెట్టుబడి విలువ రూ.7.30 లక్షల కోట్లు అని చంద్రబాబు చెప్పారు. వీటి ద్వారా 7.7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్నారు. సమ్మిట్‌కు ముందు ఐదు దేశాల్లో, దేశంలోని ఆరు నగరాల్లో కలిపి 11 పెట్టుబడి రోడ్‌షోలు నిర్వహించామని చెప్పారు.

విశాఖలో ఏఐ, డేటా సెంటర్లు, కాకినాడలో సముద్ర ఆధారిత పరిశ్రమలు, అమరావతిలో క్వాంటమ్, అనంతపురంలో రక్షణ రంగం, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌పై ప్రాంతీయ సదస్సులు జరిగాయన్నారు. అక్టోబర్ 7 నుంచి 26 వరకు జరిగిన ప్రాంతీయ సదస్సుల్లో 194 ఒప్పందాలు కుదిరాయి. వాటి పెట్టుబడి విలువ రూ.86,522 కోట్లు. వీటి ద్వారా 1,47,951 ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు.

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరిగిన ప్రధాన సమ్మిట్‌లో 109 ఒప్పందాలు కుదిరాయన్నారు. వాటి పెట్టుబడి విలువ రూ.9,02,434 కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. వీటి ద్వారా 2,00,358 ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ సదస్సులు, ప్రధాన సమ్మిట్ కలిపి 303 కొత్త ఒప్పందాలు, సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు, 3,48,309 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు.

జూన్ 2024 నుంచి తాజాగా నిర్వహించిన సీఐఐ సదస్సు వరకు మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కియా రూ.18,878 కోట్లతో పెనుకొండ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షల వాహనాల మేర పెంచేందుకు ముందుకొచ్చిందని, దీని ద్వారా అదనంగా 12,000 ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు.

భవిష్యత్ పారిశ్రామిక రంగంలో మహిళల పాత్ర అత్యంత కీలకం కానుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలలో 50 శాతం మంది మహిళలే ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ఆర్థిక సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ఎప్పుడూ ముందుంటుందని సీఎం అన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్, మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. విశాఖపట్నం త్వరలోనే ఒక ప్రధాన టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్‌గా మారబోతోందని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పోర్టులు, రహదారుల అనుసంధానం రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు వివరించారు.

తెలంగాణా సీఎం రేవంత్‌ కు బిగ్ టాస్క్ ఇచ్చిన సీఎం చంద్రబాబు!
తెలంగాణా సీఎం రేవంత్‌ కు బిగ్ టాస్క్ ఇచ్చిన సీఎం చంద్రబాబు!

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి భద్రత కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో ఇప్పుడు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మరియు వారి హక్కులకు రక్షణ కల్పించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ విధానాలపై నమ్మకంతో ఏపీకి తరలివస్తున్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+