కోట్లాది మందికి ఇబ్బందులు.. క్షమాపణలు చెప్పిన మైక్రోసాఫ్ట్!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిన మైక్రోసాఫ్ట్ సాంకేతిక అంతరాయం రెండో రోజు కూడా కొనసాగింది. దాదాపు 18 గంటలకు పైగా నిలిచిపోయిన అవుట్‌లుక్ ఈమెయిల్, ఇతర అనుబంధ సేవలు శుక్రవారం సాయంత్రం నుంచి నెమ్మదిగా పునరుద్ధరించబడుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో దెబ్బతిన్న, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేశామని.. ట్రాఫిక్‌ను దశలవారీగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే కొన్ని సేవల్లో ఇంకా అడపాదడపా అంతరాయాలు ఉండవచ్చని వెల్లడించింది.

ఎక్కడికక్కడ స్తంభించిన మైక్రోసాఫ్ట్- గ్లోబల్ అవుటేజ్
ఎక్కడికక్కడ స్తంభించిన మైక్రోసాఫ్ట్- గ్లోబల్ అవుటేజ్

క్షమాపణ చెప్పిన మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్
ఈ సాంకేతిక లోపం వల్ల వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ లింక్డ్‌ఇన్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు తమ గ్లోబల్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఇండియాలో ఈ సమస్య మొదలవ్వగా.. శుక్రవారం ఉదయం ఆఫీసు వేళల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Microsoft Outage Outlook Services Slowly Restored After 18 Hours Company Apologizes to affected users

సైబర్ దాడి కాదు.. అసలు కారణం ఇదే!
ఈ భారీ అవుటేజ్ వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ, దురుద్దేశపూరిత చర్యలు గానీ లేవని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ లామానా ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ట్రాఫిక్ పెరగడం వల్ల కాకుండా కొన్ని సర్వర్లు అకస్మాత్తుగా నిలిచిపోవడం వల్ల మిగిలిన సర్వర్లపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య తలెత్తిందని కంపెనీ వివరించింది. సేవలు పూర్తిగా పునరుద్ధరించిన అనంతరం దీనికి గల అసలు కారణాలతో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేస్తామని వెల్లడించింది.

టాటా పంచ్‌కు రోజులు దగ్గరపడ్డాయా? మారుతి కొత్త ఎస్‌యూవీ వచ్చేస్తోంది!
టాటా పంచ్‌కు రోజులు దగ్గరపడ్డాయా? మారుతి కొత్త ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

భారత విమానయాన సంస్థలపై ప్రభావం
మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయం ప్రభావం భారత విమానయాన రంగంపైనా పడింది. దేశీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఆకాశ ఎయిర్ తమ ఈమెయిల్ సపోర్ట్ సేవలకు అంతరాయం కలిగిందని, ప్రయాణీకులు ప్రత్యామ్నాయ కస్టమర్ కేర్ ఛానెళ్లను సంప్రదించాలని సూచించాయి. మరోవైపు ఎయిరిండియా తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని, ఈమెయిల్ సేవలకు ఇబ్బంది కలగకుండా ముందుజాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ప్రస్తుతం అవుట్‌లుక్ మెయిల్ బాక్సులు తెరుచుకుంటుండగా.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోని క్యాలెండర్ సేవలు కూడా క్రమంగా మెరుగుపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+