ఎన్విడియా తదుపరి సీఈవోగా భారతీయుడు? రేసులో ముగ్గురు దిగ్గజాలు!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేయడంతో టెక్ ప్రపంచంలో కొత్త చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం కంపెనీ సీఎఫ్‌వో కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించినప్పటికీ.. శాశ్వత సీఈవో ఎంపికపై అందరి దృష్టి నెలకొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ తరహాలోనే ఎన్విడియా పగ్గాలు కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి చేతికి వెళ్తాయా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ రేసులో ముగ్గురు ప్రముఖ భారతీయ టెక్ దిగ్గజాల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

మరోవైపు యాపిల్ మాజీ బాస్ టిమ్ కుక్‌ను ఎన్విడియా సీఈవోగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే టిమ్ కుక్ ప్రస్తుతం యాపిల్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ చైర్‌గా కొనసాగుతుండటంతో ఆయన కంపెనీని వీడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్విడియా బోర్డు సంస్థ లోపలి వారితో పాటు బయటి అభ్యర్థులను కూడా పరిశీలిస్తోంది.

ఎన్విడియా తదుపరి సీఈఓ అతనే.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఎన్విడియా తదుపరి సీఈఓ అతనే.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రేసులో ఉన్న ముగ్గురు భారతీయ దిగ్గజాలు వీరే..

1.నికేష్ ఆరోరా
ఎన్విడియా తదుపరి సీఈవో రేసులో నికేష్ అరోరా పేరు అత్యంత బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ దిగ్గజం పాలో ఆల్టో నెట్వర్క్స్‌కు ఛైర్మన్, సీఈవోగా ఉన్న ఆయన.. గతంలో గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా, జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సెకోయా క్యాపిటల్ పార్ట్‌నర్ షాన్ మగైర్, స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బహల్ సహా పలువురు ఇన్వెస్టర్లు అరోరా పేరును గట్టిగా సమర్థిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టాక పాలో ఆల్టో మార్కెట్ విలువ ఎనిమిదేళ్లలో 17 బిలియన్ డాలర్ల నుంచి 275 బిలియన్ డాలర్లకు చేరడాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు.

Indian-Origin Next NVIDIA CEO Nikesh Arora Thomas Kurian Sanjay Mehrotra in the Race Full Details Here

2.థామస్ కురియన్
కేరళలో జన్మించిన థామస్ కురియన్ ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఒరాకిల్ సంస్థలో 22 ఏళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన నేతృత్వంలో గూగుల్ క్లౌడ్ ఏఐ సేవల రంగంలో గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ డేటా సెంటర్లలో ఎన్విడియా ఏఐ చిప్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో థామస్ కురియన్ అనుభవం ఎన్విడియాకు ఎంతో ఉపయోగపడుతుందని హెడ్జ్ ఫండ్ మేనేజర్లు భావిస్తున్నారు.

అఫైర్ ఎఫెక్ట్.. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా!
అఫైర్ ఎఫెక్ట్.. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా!

3. సంజయ్ మెహ్రోత్రా
కాన్పూర్ లో జన్మించిన సంజయ్ మెహ్రోత్రా ప్రస్తుతం ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా ఉన్నారు. గతంలో శాన్ డిస్క్ సహ వ్యవస్థాపకుడిగా.. సీఈవోగా పనిచేశారు. ఏఐ సర్వర్లలో ఎన్విడియా జీపీయూ చిప్స్‌లతో పాటు హై-బ్యాండ్ విడ్త్ మెమరీ కీలక పాత్ర పోషిస్తుంది. సెమీకండక్టర్ పరిశ్రమ, సప్లై చైన్ వ్యవహారాలపై సంజయ్ మెహ్రోత్రాకు ఉన్న లోతైన అవగాహన ఆయనను ఈ రేసులో ముందు వరుసలో నిలుపుతోంది.

ఇతర పోటీదారులు ఎవరంటే?
భారత సంతతి నేతలతో పాటు పలువురు అంతర్జాతీయ టెక్ దిగ్గజాల పేర్లు కూడా ఎన్విడియా సీఈవో పదవికి పరిశీలనలో ఉన్నాయి. సంస్థ అంతర్గత అభ్యర్థులుగా కోలెట్ క్రెస్, ఎన్విడియా 'CUDA' సాఫ్ట్ వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ బక్ రేసులో ఉన్నారు. బయటి వారిలో ఏఎండీ సీఈవో లిసా సూ, ఆర్మ్ సీఈవో రెనే హాస్, ఇంటెల్ మాజీ సీఈవో ప్యాట్ గెల్సింగర్, యాపిల్ హార్డ్‌వేర్ హెడ్ జానీ స్రౌజీ తదితరులతో కలిపి మొత్తంం 11 మంది పేర్లపై ఎన్విడియా బోర్డు కసరత్తు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+