ఎక్కడికక్కడ స్తంభించిన మైక్రోసాఫ్ట్- గ్లోబల్ అవుటేజ్
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆ సంస్థకు చెందిన అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్‌తో పాటు పలు డిజిటల్ సర్వీసులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. గంటల తరబడి కొనసాగిన ఈ సర్వర్ ఆటంకం మైక్రోసాఫ్ట్ సొంత సర్వీసులకే పరిమితం కాలేదు. దాని మౌలిక సదుపాయాలపై ఆధారపడిన ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. దీనివల్ల లక్షలాదిమంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సర్వర్లలో అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తెలిపింది. ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ ఇమెయిల్ వ్యవస్థలో తలెత్తిన లోపంతో ఈ సమస్య ఆనంభమైంది. అవుట్‌లుక్ పనిచేయట్లేదంటూ డౌన్‌డిటెక్టర్ ప్లాట్‌ఫామ్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి దాదాపు 1,38,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. దీనివల్ల ఈమెయిల్స్, విండోస్ 365, మైక్రోసాఫ్ట్ ప్లానర్, డిఫెండర్, మైక్రోసాఫ్ట్ గ్రాఫ్, పవర్ బీఐ, షేర్‌పాయింట్ ఆన్‌లైన్ వంటి పలు ఇతర కార్పొరేట్ అప్లికేషన్ల పనితీరు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది.

ఈ గ్లోబల్ అవుటేజ్ పై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. సర్వర్లపై ఒకేసారి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఈ ఆటంకం తలెత్తిందని స్పష్టం చేసింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థనలను సకాలంలో ప్రాసెస్ చేయడంలో సర్వర్లు విఫలం కావడంతో ఈ సాంకేతిక సమస్య ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ బృందం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. యూజర్ ట్రాఫిక్ అకస్మాత్తుగా పెరగడం వల్ల ఈ లోపం సంభవించిందనే వాదనలను తోసిపుచ్చింది.
నెట్‌వర్క్ మెయింటెనెన్స్, తక్కువ సంఖ్యలో సర్వర్లు అందుబాటులో ఉండటమే అసలు కారణమని స్పష్టం చేసింది. ఇటీవల చేసిన ఓ నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ మార్పును వెంటనే వెనక్కి ఉపసంహరించుకుంటోన్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ తెలిపింది. తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో యూజర్ ట్రాఫిక్ పై పరిమితులను విధించాల్సొచ్చిందని, దీనివల్ల మైక్రోసాఫ్ట్ టీమ్స్ లోని మెసేజింగ్ సేవలు కొంతమేర అందుబాటులోకి వచ్చినట్లు వివరించింది.
We're investigating reports of users experiencing issues accessing Exchange Online mailboxes through multiple connection methods in the Americas. More details can be found in the Microsoft 365 admin center under EX1550543.
— Microsoft 365 Status (@MSFT365Status) November 12, 2026
క్యాలెండర్, మీటింగ్ షెడ్యూలింగ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఫీచర్లు నిలిచిపోయాయి. ఈ డిజిటల్ అవుటేజ్ ప్రభావం మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపై ఆధారపడే ఇతర దిగ్గజ ఏఐ సంస్థలను కూడా దెబ్బతీసింది. మైక్రోసాఫ్ట్ కనెక్టర్లలో లోపాలు తలెత్తినట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించగా, అప్‌స్ట్రీమ్ ప్రొవైడర్ వైఫల్యం వల్ల తమ ఏఐ సేవలకు విఘాతం కలిగిందని ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.












Click it and Unblock the Notifications
