సాయి రెడ్డి పై ఫిర్యాదు : మా ప‌రువు పోయింది: ఇసి కి వేటు ప‌డిన‌ ఎస్పీల లేఖ‌..!

ఎన్నిక‌ల సంఘం..ఏపి ప్ర‌భుత్వం..వేటు ప‌డిన అధికారులు. ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఈ వ్య‌వ‌హారంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల సంఘం మీద ఏపి ప్ర‌భుత్వం కేసు దాఖ‌లు చేస్తే...విజ‌య సాయి రెడ్డి మీద వేటు ప‌డిన శ్రీకాకుళం ఎస్పీ వెంక‌ట ర‌త్నం ఫిర్యాదు చేసారు. త‌న పై ఆరోప‌ణ‌లు నిరూపించాలి..లేదా ఫిర్యాదు చేసిన వారి పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు.

సాయి రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోండి..

సాయి రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోండి..

ఎన్నిక‌ల సంఘం ఎటువంటి విచార‌ణ లేకుండా తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా త‌న ప‌రుపు పోయింద‌ని శ్రీకాకుళం మాజీ ఎస్పీ వెంక‌ట‌రత్నం ఆవేద‌న చెందుతున్నారు. త‌న పై ఆరోపణలు నిరూపించాలి లేదా నాపై తప్పుడు ఆరోప ణలు చేసినవారి (విజయసాయిరెడ్డి)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ద్వివేదీకి ఆయ‌న లేఖ రాసారు. త‌న పై విజ‌య సాయి రెడ్డి చేసిన ఫిర్యాదు పై వివ‌ర‌ణ ఇచ్చారు. తాను అస‌లు సాయిరెడ్డి చెబుతున్న‌ట్లు గా ఆ రోజున అధికారిక స‌మీక్ష‌ల్లో ఉన్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 2019 మార్చి 18న.. నేను పూర్తిగా మా కార్యాలయంలో నే ఉన్నాను. అధికారులందరితో భోజనానికి ముందు, తర్వాత ఒక క్రైమ్‌ మీటింగ్‌లో పాల్గొన్నాను. మావోయిస్టు ప్రభావి త ప్రాంతాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నా. వీటన్నిటి నేపథ్యంలో నేను అసలు మా కార్యాలయం నుంచి బయటికే రాలేదు. ఆ సంఘటనకు సంబంధించి ఆ రోజున నాకు ఎలాంటి ఫోన్‌కాల్‌గానీ, సమాచా రం గానీ రాలేద అంటూ లేఖ‌లో పేర్కొన్నారు.

ఫిర్యాదు..వివ‌ర‌ణ‌...

ఫిర్యాదు..వివ‌ర‌ణ‌...

శ్రీకాకుళం ఎస్పీ వెంక‌ట‌రత్నం పై విజ‌య సాయి రెడ్డి చేసిన ఫిర్యాదు ప్ర‌కారం టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ బంధువు వాహనంలో రూ.50కోట్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోకుండా వదిలేశారని ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొ న్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, సాక్ష్యంగా కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు. అయితే.. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ తప్పు అని వెంక‌ట ర‌త్నం వివ‌ర‌ణ ఇచ్చారు. 2019, మార్చి 18న మధ్యాహ్నం 1.10గంటలకు సంతకవిటి మండలం పొనుగుటి వలసవద్ద.. సంతకవిటి మండలం డిప్యూటీ తహసీల్దారు ఆర్‌ గంగా భవాని నేతృత్వంలోని స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ ఒక కారును తనిఖీ చేసింది. అందులో కొన్ని టీడీపీ పోస్టర్లు, స్టిక్కర్లు, కరపత్రాలు ఉన్నాయి. దీంతో ఆమె ఆ వాహనాన్ని వదిలేశారు. అయితే, అక్కడున్న మీడియా వ్యక్తులు ఆమెను ప్రశ్నించడంతో.. కారును వెనక్కిరప్పించి కారులో ఉన్నవాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటివిలువను రూ.7వేలుగా లెక్కించి.. 19వ తేదీన ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖర్చు ఖాతాలో వేశారని వివ‌ర‌ణ ఇచ్చారు.

అధికారుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం..

అధికారుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం..

ఏపి ప్ర‌భుత్వం మాత్రం ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాన్ని ప్ర‌తిష్ఠ‌తో ముడి ప‌డి ఉన్న అంశంగా తీసుకుంది. వైసిపి నేత లు ఫిర్యాదు చేస్తే త‌మ అధికారుల పై చ‌ర్య‌లు తీసుకుంటారా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంట‌లిజెన్స్ చీఫ్ ను త‌ప్పించి ఇద్ద‌రు ఎస్పీల పై మాత్రం ఏపి ప్ర‌భుత్వం వేటు వేసింది. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం పై హైకోర్టులో వేసిన పిటిష‌న్ పైనా వాదోప‌వాదాలు జ‌రుగుతున్నాయి. ఇక‌, ఇద్ద‌రు ఎస్పీలు తాము చేసిన త‌ప్పులు ఏంటి..వివ‌ర‌ణ ఏంటనే అంశం పై ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు రాసారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఎటు వైపు ట‌ర్న్ తీసుకుంటుందో అనే ఆస‌క్తి రాజ‌కీయంగా నెల‌కొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+