మృతికి కారణమదే!, అన్న అని పిల్చినా అసభ్యంగా: డైరీలో రిషికేశ్వరి

గుంటూరు: రిషికేశ్వరి ఘటన పైన ప్రిన్సిపల్ డేవిడ్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయన సాక్షితో మాట్లాడి... పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా చెబుతున్నారు.

ఆడపిల్లలకు రక్షణ లేదని ఉన్నతాధికారులకు ఇంతకుముందు ఫ్యాకల్టీ అంతా కలిసి ఫిర్యాదు చేశామని, కానీ మా ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నట్లు తమకైతే కనిపించలేదన్నారు. ప్రెషర్స్ డే పార్టీలో జరిగిన అవమానాల గురించి కూడా డైరీలో రాసుకుందన్నారు. దాంట్లో చాలా ఉన్నాయని తెలిపారు.

ప్రెషర్స్ డే పార్టీకి ఒక్క ప్రిన్సిపల్ బాబురావు మాత్రమే వెళ్లారని, వేరే ఫ్యాకల్టీ వెళ్లలేదన్నారు. మిగిలిన వారు ఎవరూ వేళ్లలేదన్నారు. మిగిలిన ఫ్యాకల్టీ ఉంటే అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం చేసేవాళ్లు కాదన్నారు. ప్రిన్సిపల్ తానొక్కరే వెళ్లారని చెప్పారు.

New twist in Rishikeshwari suicide

యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందని, అక్కడ చేసుకోవచ్చు కానీ అలా చేయలేదన్నారు. రోజు తాగి వస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నా, ప్రెషర్స్ డే రోజు విద్యార్థులతో కలిసి ఎందుకు తాగారన్నారు. ఆయన మద్యం తాగి వస్తున్నారని తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు.

2014 మార్చిలో గవర్నర్‌కు మెయిల్ కూడా చేశామని చెప్పారు. కులం ముసుగులో ప్రిన్సిపల్ ఇలా ఇదంతా చేస్తున్నారన్నారు. ఆయన మాట వినడే లేదని తనను హెచ్చరించారని, వినకపోతే దెబ్బతింటావని చెప్పారన్నారు.

అనధికారికంగా తనకు నచ్చిన చోట పార్టీ చేయడమే రిషికేశ్వరి మృతికి కారణమన్నారు. చాలామంది పిల్లలు ప్రిన్సిపల్ ప్రవర్త గురించి తమ దగ్గర బాధపడి, ఏడ్చేవారన్నారు. ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతారని, డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనుక నుంచి చేతులు వేస్తారని బాధపడ్డారని తెలిపారు.

రిషికేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..!

రిషికేశ్వరి తన డైరీలో రాసుకున్నదంటూ కథనం వచ్చింది. ఆరో తరగతి నుంచి ఒంటరితనం అనుభవించానని, చరణ్ ఒక ఇడియట్ అని, అన్న అని పిలిచినా అసభ్యంగా ప్రవర్తించాడని, బీచ్‌కు వెళ్లి వస్తుంటే ఆటలో పైశాచికంగా వ్యవహరించారని, శ్రీనివాస్‌ను ప్రేమించాలని అనిశా ఒత్తిడి చేసిందని రిషికేశ్వరి డైరీలో రాసుకున్నట్లు పేర్కొంది. తాను నమ్మిన వారు మోసం చేశారని రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+