రౌడీషీటర్ సుబ్బు హత్య కేసులో కొత్త ట్విస్ట్: 9మంది పాత్ర
విజయవాడ: హత్యకు గురైన బెజవాడ రౌడీషీటర్ కేసులో మరో ట్విస్ట్. సుబ్బును హత్య చేసింది తొమ్మిది మంది వైసీపీ నాయకులు అని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఈ హత్యతో కాట్రగడ్డ శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సుబ్బు హత్యలో ప్రధాన సూత్రధారి వైసీపీ నాయకుడు సురేంద్ర అని చెప్పారు.

కాగా, ఇటీవల సుబ్బు హత్యతో బెజవాడు ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై అతనిని ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు.
ఈ హత్యతో విజయవాడ టీడీపీ యూత్ విభాగం అధ్యక్షుడు శ్రీను హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన హస్తం లేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications