Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేనతో టచ్ లో మాజీ మంత్రి బాలినేని - తేల్చి చెప్పిన మాజీ మంత్రి..!!

మాజీ మంత్రి బాలినేని రాజకీయ ప్రయాణంలో మార్పు ఉంటుందా. సీఎం జగన్ బంధువు.. సీనియర్ నేత బాలినేని జనసేనతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా..చేనేత దినోత్సవం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ హ్యాండ్లూమ్ ఛాలెంజ్ లో భాగంగా పవన్ కు సవాల్ చేసారు. దీనిని స్వీకరించిన జనసేన మరో ముగ్గురికి ఛాలెంజ్ చేసారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా మాజీ మంత్రి బాలినేని ఉన్నారు. దీంతో..ఈ ప్రచారం మరింత జోరుగా సాగింది.

Recommended Video

    దమ్ముంటే రాజీనామా చెయ్యండి, ఈటల రాజేందర్ సవాల్ *National |Telugu OneIndia
    పార్టీ నేతలతో బాలినేని సమావేశం

    పార్టీ నేతలతో బాలినేని సమావేశం

    ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో గిద్దలూరు వ్యవహారం పైన బాలినేని సమావేశం అవ్వటం పైన ఇదంతా జనసేనతో టచ్ లో ఉండటంతో భాగమంటూ ప్రచారం కొనసాగింది. దీని పైన మాజీ మంత్రి బాలినేని స్పష్టత ఇచ్చారు. తాను జనసేన నేతలతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవమని తేల్చి చెప్పారు. ఆ ప్రచారం లో వాస్తవం లేదన్నారు.

    తాను వైఎస్సార్ పెట్టిన భిక్షతోనే ఎమ్మెల్యేను అయ్యాయని స్పష్టం చేసారు. గతంలో తన మంత్రి పదవి వదిలి జగన్ కోసం వచ్చానని గుర్తు చేసారు. ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని బాలినేని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానంటూ మాజీ మంత్రి బాలినేని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

    జనసేనతో టచ్ లో - బాలినేని క్లారిటీ

    జనసేనతో టచ్ లో - బాలినేని క్లారిటీ

    తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం వైసీపీలోనే ఉంటానని.. లేకుంటే రాజకీయాలు విరమిస్తానని చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేతకు సంబంధించి తనకు టాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయ్యానని వివరించారు. కేటీఆర్, పవన్ కళ్యాణ్ కు కూడా ట్వీట్ చేశారు.. దాన్ని మాత్రం హైలెట్ చేయరంటూ బాలినేని అసహనం వ్యక్తం చేశారు.

    బాలినేని జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని కేబినెట్ నుంచి తప్పించి సురేష్ ను కొనసాగించిన సమయంలోనూ బాలినేని మనస్థాపానిక గురయ్యారు. సజ్జల సంప్రదింపులు..సీఎంతో భేటీ తరువాత బాలినేని శాంతించారు.

    ఎన్నికష్టాలు వచ్చినా జగన్ వెంటే

    ఎన్నికష్టాలు వచ్చినా జగన్ వెంటే

    ఇప్పుడు, బాలినేని పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. తాజాగా ఈ మధ్య కాలంలో కేసినో వ్యవహారంలోనూ జరిగిన ప్రచారం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కేసినోకు వెళ్తానని.. అప్పుడప్పుడు పేకాట ఆడుతానని ఓపెన్ గా అంగీకరించిన బాలినేని..ఈడీ విచారిస్తున్న చీకోటీ లాంటి వారితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

    ఎవరైనా ఇటువంటి ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఇక, ఇప్పుడు జనసేనతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇలా..వరుసగా బాలినేని లక్ష్యంగా జరుగుతన్న ప్రచారాల పైన ఇప్పుడు వైసీపీలో చర్చ సాగుతోంది. జనసేనతో టచ్ లో ఉన్న వ్యవహారం పైన బాలినేని స్పష్టతతో వైసీపీ కేడర్ కు క్లారిటీ వచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+