Telangana Weather : రాబోయే 3,4 రోజులు తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

తెలంగాణవ్యాప్తంగా రాబోయే మూడు,నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం(ఆగస్టు 16) పెద్దపల్లి,భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ రూరల్,ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కరీంనగర్,మహబూబాబాద్,వరంగల్ అర్బన్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నెల 17న ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కరీంనగర్,సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల నుంచి 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణపై నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్నట్లు తెలిపింది.

next four days light to moderate rains in telangana says Meteorological Department

ఆదివారం(ఆగస్టు 15) రాష్ట్రంలోని పలుచోట్లు తేలికపాటి వర్షం కురిసినట్లు తెలిపింది. మంచిర్యాల,భూపాలపల్లి,ములుగు,సూర్యాపేట జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ జారీ చేసినట్లు వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా తీరంలో 3.6కి.మీ నుంచి 7కి.మీ ఎత్తులో ఉందని తెలిపింది. అలాగే ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో మరో ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3,4 రోజులు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

    ఉష్ణోగ్రతల విషయానికి వస్తే... హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 32.5డిగ్రీలు,కనిష్ఠం 23.6గా నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 34.3డిగ్రీల ఉష్ణోగ్రత,అత్యల్పంగా భద్రాచలంలో 20డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 22 శాతం వర్షపాతం నమోదైందని... సాధారణ వర్షపాతం 482.1మి.మీ నమోదైందని తెలిపింది. ఇప్పటివరకూ 4 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం,14 జిల్లాల్లో అధిక వర్షపాతం,15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+