ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నారు, కానీ: నిర్మల, నిట్‌లో 480 సీట్లు ఇలా..
విశాఖ: ఏ రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం చెప్పిందని, అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చెప్పారు.
ఆమె గాజువాకలో కంటైనర్ ప్రైజ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చుతామన్నారు. ఎక్స్‌పోర్టు ఎక్సలెంట్ డెవలప్‌మెంట్ నగరాలుగా విశాఖ, భీమవరాన్ని ప్రకటించినట్లు చెప్పారు.
ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. విభజన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. విశాఖలో అంతర్జాతీయ సీ ఫుడ్ ట్రేడ్ షేర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తాడేపల్లిగూడెం నిట్‌కు 480 సీట్లు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడులు గురువారం ఉదయం నిట్‌కు శంకుస్థాపనం చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేశారు.
తాడేపల్లిగూడెం నిట్‌కు కేంద్రం 480 సీట్లు కేటాయించారు. వరంగల్ నిట్‌లో ఏపీ విద్యార్థుల కోసం 60 సూపర్ న్యూమరీ పోస్టులు కేటాయించారు. తాడేపల్లిగూడెం నిట్‌లో స్థానికులకు 240 సీట్లు కేటాయించారు. 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఏ కోర్సుకు ఎన్ని సీట్లు..
బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ 30 సీట్లు, కెమికల్ ఇంజినీరింగ్ 30, సివిల్ ఇంజినీరింగ్ 60, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 90, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 90, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 90, మెకానికల్ ఇంజినీరింగ్ 60, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ 30 సీట్లు.












Click it and Unblock the Notifications